వాదోపవాదాలతో దద్దరిల్లుతున్న బిగ్ బాస్ హౌస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ సీజన్ 5 కథ కంచికి చేరే సమయం ఆసన్నం కావడంతో హౌస్ మేట్స్ మధ్య వాదోపవాదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా నామినేషన్స్ సమయంలో కెప్టెన్ తప్ప అంతా నామినేషన్స్ కు గురవుతామనే విషయం తెలిసి కూడా, ఎవరి వాదనలు వారు వినిపించే క్రమంలో గట్టిగా అరుచుకుంటూ, వీక్షకుల సహనానికి పరీక్ష పెడుతున్నారు. సోమవారం నామినేషన్స్ సమయంలో సన్నీ, శ్రీరామచంద్ర మధ్య వివాదం చినికి చినికి గాలివానగా మారింది. మధ్యలో మానస్ వచ్చి వారిని వారించాల్సిన పరిస్థితి వచ్చింది. యానీ మాస్టర్ హౌస్ నుండి వెళ్ళిపోవడానికి ‘నువ్వు కారణమంటే – నువ్వు కారణం’ అంటూ ఒకరిని ఒకరు విమర్శించుకున్నారు. ఈసారి అత్యధికంగా ఎక్కువ మంది రవిని నామినేట్ చేశారు. షణ్ముఖ్, సిరి, సన్నీ, కాజల్, మానస్ ఈ ఐదుగురు రవిని నామినేట్ చేయగా; కాజల్ ను రవి, షణ్ముఖ్, శ్రీరామ్ నామినేట్ చేశారు. అలానే శ్రీరామ్ ను కూడా ముగ్గురు (సన్నీ, కాజల్, మానస్) నామినేట్ చేశారు. ఇక సన్నీని ఇద్దరు (రవి, శ్రీరామ్) నామినేట్ చేశారు. చిత్రంగా ప్రియాంక, షణ్ముఖ్, సిరి లను ఒక్కొక్కరే నామినేట్ చేశారు. రవిని నామినేట్ చేసే సమయంలో ఈ హౌస్ లో పెద్ద ఫేక్ నువ్వే అంటూ సన్నీ కామెంట్ చేయగా, ఈ హౌస్ లో తనకు ఇష్టంలేని వ్యక్తి రవి అంటూ కాజల్ ముఖం మీదనే చెప్పేసింది. అలానే శ్రీరామ్ కాజల్, సన్నీ, మానస్ తో చేసిన వాదోపవాదాలు ఒక స్థాయిలో చికాకు తెప్పించాయి. ఏదో రకంగా తమ నిర్ణయమే కరెక్ట్ అని చెప్పడానికి వారంతా ఓవర్ యాక్షన్ చేస్తున్నారనిపించింది.
ఉతపదంగా మారిన బరాబర్!
ఇంటి సభ్యులంతా ‘బరాబర్’ను ఊతపదంగా మార్చేసుకున్నారు. ఒకరిని ఒకరు విమర్శించుకునేప్పుడు, తమ అభిప్రాయాలను నొక్కి చెప్పాలనుకున్నప్పుడు, మరీ ముఖ్యంగా వాదోపవాదాల సమయంలో ‘బరాబర్’ అనే పదాన్ని తరచూ ఉపయోగిస్తున్నారు. నామినేషన్స్ సమయంలో ‘అలా మాట్లాడొద్దు’ అని ఎవరైనా ఇతరులను అనగానే ‘బరాబర్ చెబుతా, బరాబర్ అంటా’ అని నొక్కి మరీ చెబుతున్నారు.
Also Read
ఇంగ్లీష్ లోనే వాదోపవాదాలు!
గతంలో జరిగిన బిగ్ బాస్ షోలకు దీనికి మధ్య ఓ తేడా స్పష్టంగా కనిపిస్తోంది. నాలుగో షో వరకూ ఎవరైనా ఎక్కువగా ఇంగ్లీష్ లో మాట్లాడితే బిగ్ బాస్ తెలుగులో మాట్లాడమని గట్టిగా చెప్పేవాడు. ఒకవేళ తెలుగు రాకపోతే మిగిలిన హౌస్ మేట్స్ దగ్గర నేర్చుకోమని సలహా ఇచ్చేవాడు. అంతేకాదు ఎక్కువగా ఇంగ్లీష్, హిందీ భాషను ఉపయోగిస్తే, పనిష్మెంట్ కూడా ఇచ్చేవాడు. కానీ ఈసారి ఆ పాలసీని పక్కన పెట్టినట్టు కనిపిస్తోంది. పైగా ఇంటి సభ్యులు ఒకరిని ఒకరు విమర్శించుకునే క్రమంలో ఎక్కువగా ఇంగ్లీష్ భాషనే ఉపయోగిస్తున్నారు. బిగ్ బాస్ సైతం అందుకు అభ్యంతరం చెబుతున్నట్టు లేదు. ఇక మీదట ఇంగ్లీష్ భాష మీద మంచి పట్టుఉండి, ఆ భాషలో వాదనా పటిమ ఉన్నవారికే బిగ్ బాస్ ప్రాధాన్యం ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదనిపిస్తోంది.
తాజావార్తలు
-
India U18 Hockey Asia Cup Champion: జపాన్‌పై ఘన విజయం.. అండర్-18 హాకీ ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్
-
Horoscope Today: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి!
-
Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
-
Salim Kumar Passed Away : ప్రముఖ నటుడు జాతీయ అవార్డు గ్రహీత కన్నుమూత.!
-
Spirit : ‘స్పిరిట్’ ఇంటర్నేషనల్ అన్నారు కదా.. మరి లోకల్ లోనే చుట్టేస్తున్నారేంటి?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!