NTV Telugu Site icon

హీరో ఆఫ్ ది హౌస్ ఎలిమినేషన్ కు కారణం ఏంటి!?

బిగ్ బాస్ సీజన్ 5 లో గడిచిన పదివారాల్లో రెండు సార్లు కెప్టెన్ గా పనిచేసిన విశ్వ ఎలిమినేషన్ చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. రేషన్ మేనేజర్ గానూ ఎంతో నిబద్ధతతో విశ్వ పనిచేశాడు. ప్రియా కొన్ని సందర్భాలలో అతన్ని విమర్శించినా, హౌస్ మేట్స్ ఎక్కువ విశ్వ పనితనాన్ని మెచ్చుకున్నారు. అంతేకాదు… హౌస్ లోకి వచ్చిన తొలి రోజు నుండి విశ్వ వీలైనంత వరకూ ఇండివిడ్యువల్ గేమ్ నే ఆడుతూ వచ్చాడు.

అందరితో కలివిడిగా ఉంటూ, ముందుకు సాగాడు. మరీ ముఖ్యంగా కిచెన్ లో మాగ్జిమమ్ వర్క్ చేస్తూనే మిగిలిన ఇంటి సభ్యులందరికీ ఎనీ టైమ్ హెల్ప్ కు రెడీ గా ఉండేవాడు. అలాంటి వ్యక్తి ఎలిమినేట్ కావడం ఎంతో మందిని బాధించింది. అయితే, విశ్వ ఎలిమినేషన్ కు కారణంగా ఆడియెన్స్ ఓటింగ్ కాదని, కేవలం బిగ్ బాస్ షో టీఆర్పీ కారణమనే విమర్శలు మొదలయ్యాయి. కాజల్ – విశ్వ ఫైనల్స్ కు చేరిన తర్వాత కాజల్ ఉంటేనే షోకు ఆదరణ ఉంటుందని నిర్వాహకులు భావించారట.

కాజల్ – విశ్వకు ఉన్న పాపులారిటీని కంపార్ చేస్తే, ఆమెదే పై చేయిగా ఉంటుందని అంటున్నారు. పైగా బిగ్ బాస్ లేడీ కంటెస్టెంట్స్ ను టార్గెట్ చేశాడనే ఓ ప్రచారం గత వారమంతా సోషల్ మీడియాలో విశేషంగా జరిగింది. దాంతో కాజల్ ను ఇప్పుడు బయటకు పంపితే ఆ వాదనలో నిజం ఉంటుందనే భావనకు నిర్వాహకులు వచ్చారట. మొత్తం మీద వీటన్నింటి కారణంగా విశ్వ ఎలిమినేట్ అయ్యాడని తెలుస్తోంది. ఒకానొక సమయంలో జస్వంత్ ఆరోగ్యం దృష్ట్యా బిగ్ బాస్ అతన్ని కూడా బయటకు పంపేస్తాడని అనుకున్నారు. ఆరోగ్యం అంత బాగా లేకపోయినా, జెస్సీ కొన్ని టాస్క్ లలో పాల్గొనడంతో అతను సేఫ్ అయ్యాడని తెలుస్తోంది.

శ్రీరామ్ సన్నిహితులే బయటకు వస్తున్నారా!?
గడిచిన కొన్ని వారాలుగా చూసినప్పుడు శ్రీరామ్ కు ఎవరైతే క్లోజ్ గా ఉంటున్నారో వారంత ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నట్టుగా అనిపిస్తోంది. హమీదా బయటకు వచ్చినప్పుడు పూర్తి గా డౌన్ అయిపోయిన శ్రీరామ్ ఇప్పుడిప్పుడు మరోసారి విశ్వ ఎలిమినేట్ కావడంతో డీలా పడ్డాడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఎలాంటిదే విశ్వ వేదిక మీదనే చెప్పాడు.

హౌస్ మేట్స్ పొజిషన్ ను టాప్ 1 నుండి 10 వరకూ చెప్పమని నాగార్జున అడగగానే విశ్వ… ఎక్కువ ఆలోచన లేకుండానే తనకు నచ్చిన శ్రీరామ్, రవి, షణ్ణును టాప్ త్రీ పొజిషన్ లో నిలిపాడు. ఇక 4, 5, 6 స్థానాలు సన్నీ, సిరి, మానస్ కు ఇవ్వగా, 7, 8, 9, 10 స్థానాలను వరుసగా అనీ, జెస్సీ, కాజల్, ప్రియాంకకు ఇచ్చాడు. ఈ హౌస్ లోని సభ్యులలో ఎక్కువగా ప్రియాంకతోనే విశ్వ కనెక్ట్ కాలేదని తెలుస్తోంది. విశ్వకు గాయమైన తర్వాత ఆమె ఇదంతా నటన అనే తరహాలో మాట్లాడటం విశ్వ తట్టుకోలేకపోయాడనేది అర్థమౌతోంది.