Priya Shetty : బిగ్ బాస్ సీజన్-9లో కామనర్లు వర్సెస్ సెలబ్రిటీలు అన్నట్టు పరిస్థితులు మారిపోయాయి. కామనర్లుగా వచ్చిన వారి ప్రవర్తనపై ప్రేక్షకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందులో ప్రియాశెట్టి కామనర్ కోటాలో ఎంట్రీ ఇచ్చింది. ఆమె గొంతుపై రకరకాల ట్రోల్స్ వస్తున్నాయి. ఈ విషయంపై తాజాగా ప్రియాశెట్టి పేరెంట్స్ స్పందించారు. వాళ్లు మాట్లాడుతూ.. మేం బిగ్ బాస్ షోకు వద్దని చెబితే ప్రియా వినలేదు. బాగా ఆడుతానంటూ వచ్చింది. అగ్నిపరీక్ష ప్రోగ్రామ్ లో ఆడియెన్స్ ఆమెకు బాగా సపోర్ట్ చేశారు. ఇప్పుడేమో ఆమె గొంతుపై ఇలా మాట్లాడుతున్నారు. అదే చాలా బాధగా అనిపిస్తుంది. ఇలాంటివి ఉంటాయనే మేం బిగ్ బాస్ లోకి వెళ్లొద్దని చెప్పాం.
Read Also : Katrina Kaif : తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్
ప్రియా గొంతు పుట్టుక నుంచి అంతే. అగ్నిపరీక్షలో ఆమె వాయిస్ స్వీట్ గా ఉందని చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు నచ్చట్లేదు. దేవుడు ఇచ్చిన గొంతుపై మనం ఏం చేయలేం. ఇలా ఆమె గొంతుపై మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆమె ఆటపై మాత్రమే చూడండి. బిగ్ బాస్ కు వెళ్తే ఆమె పెళ్లికి ఎఫెక్ట్ పడుతుందేమో అని అంతా అంటున్నారు. మేం అలాంటి భయం పెట్టుకోవట్లేదు. ఆమెను అర్థం చేసుకునే వ్యక్తికే ఇచ్చి పెళ్లి చేస్తాం అంటూ తెలిపారు ఆమె పేరెంట్స్. ప్రియాశెట్టి హౌస్ లో బాగానే ఆడుతోంది. అందరితో కలిసిమెలిసి కనిపిస్తోంది. బలంగా ఆడితే ఫైనల్ వరకు వెళ్లే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఆమె అందరితో గొడవలు మానుకుంటే బెటర్.
Read Also : Tragic Death: కుక్క గోరు గుచ్చుకుని యువకుడు మృతి..
