NTV Telugu Site icon

Pallavi Prashanth: ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంట్రా.. ఓవర్ యాక్షన్..

Palalv

Palalv

Pallavi Prashanth: రైతుబిడ్డ.. ప్రస్తుతం ఈ పేరు గురించి తెలియని వారుండరు. అదేంటి రైతుబిడ్డ అంటే ఎవరికి తెలియకుండా ఉంటుంది అంటారా.. ఇక్కడ మనం మాట్లాడేది బిగ్ బాస్ గురించి అని చెప్తే.. ఓ.. పల్లవి ప్రశాంత్ గురించా అంటే.. అవును.. ఆ రైతు బిడ్డ గురించే ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది. రైతుబిడ్డను అని చెప్పుకుంటూ.. పొలంలో రైతులు ఎలాంటి కష్టాలు పడుతున్నారో చెప్తూ వీడియోలు చేసి ప్రజల మన్ననలు పొందాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 4 నుంచి బిగ్ బాస్ తనను తీసుకోవాలని వేడుకుంటూ వీడియోలు పంపిస్తూనే ఉన్నాడు. అలా సీజన్ 7 కు పల్లవి ప్రశాంత్ హౌస్ లోకి అడుగుపెట్టాడు. ఇక అడుగుపెట్టిన దగ్గరనుంచి మానవుడిలో కొత్త కోణం బయటపడింది. రైతుబిడ్డగా లోపలి వెళ్లి.. రసికరాజాలా మారిపోయాడు. రతికాతో ప్రేమ పాఠాలు వల్లవేస్తూ కనిపించాడు. ఇక ఇక్కడవరకు బాగానే ఉన్నా .. నిన్న జరిగిన నామినేషన్ లో పల్లవి ప్రశాంత్ ఓవర్ యాక్షన్ ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదని తెలుస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో ఒక్కడే పోటుగాడు అనుకుంటూ.. పుష్ప స్టైల్లో భుజం పైకెత్తి మాట్లాడం.. తొడలు కొట్టడం.. మీసాలు మెలితిప్పి ఎగరడం.. ఇదంతా మనోడిలోని రెండో కోణం కనిపిస్తుంది.

Pedda Kaapu: అడ్డాలకు హ్యాండ్ ఇచ్చింది ఈ నటుడే.. ?

నామినేషన్ లో అమర్ దీప్ .. ప్రశాంత్ ను అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా అతనిదగ్గర సమాధానం లేదు. రైతుబిడ్డ.. అని చెప్పుకుంటూ సింపతీ తెచ్చుకోవడానికి అతడు చాలా ప్రయత్నాలు చేస్తున్నట్లు అమర్ దీప్ చెప్పుకొచ్చాడు. ఇక మొదటి నుంచి కూడా రతికా.. ప్రశాంత్ తో రాసుకొని పూసుకొని తిరుగుతుండడంతో ఆమె అయినా సపోర్ట్ చేస్తుంది అంటే.. ఆమె కూడా కుక్కలా వెంటపడి బిగ్ బాస్ కు వచ్చావ్ .. వచ్చాక ఏం చేస్తున్నావ్ అని అడిగేసింది. దీంతో రైతుబిడ్డ పరువు మొత్తం పోయింది. ఇక పల్లవి ప్రశాంత్ నామినేషన్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంట్రా.. ఓవర్ యాక్షన్.. కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ వారం నామినేషన్స్ లో పల్లవి ప్రశాంత్ కు 6 ఓట్లు పడ్డాయి. మరి ఈ వారం ప్రశాంత్ సేవ్ అవుతాడా.. ? లేదా.. ? అనేది చూడాలి.

Show comments