NTV Telugu Site icon

Bigg Boss 6: రేవంత్‌ పరువు తీసిన నాగార్జున.. పప్పూ అంటూ ఫైర్

Revanth

Revanth

Bigg Boss 6: బిగ్‌బాస్ ఆరో సీజన్ ఏ మాత్రం ఆసక్తి లేకుండా సాగుతోంది. దీంతో ఈ వారం బిగ్‌బాస్ కూడా కంటెస్టెంట్లపై సీరియస్ అయ్యాడు. ఏడో వారంలో కెప్టెన్సీ టాస్క్ రద్దు చేశాడు. అంతేకాకుండా ఆహారం కూడా దూరం చేసి కొన్ని టాస్కులు నిర్వహించాడు. ఈ నేపథ్యంలో శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున కూడా కంటెస్టెంట్లకు క్లాస్ పీకాడు. ముఖ్యంగా రేవంత్‌ను పప్పూ అని పిలుస్తూ అతడి పరువు తీశాడు. శ్రీహాన్ మాట్లాడుతుంటే.. నిలబడి ఏదో చెప్పబోయిన రేవంత్‌ను పప్పు.. పప్పు నువ్వు కూర్చో అంటూ నాగ్ అన్నాడు. దీంతో రేవంత్ ఫీలయ్యాడు. రేవంత్ మాట్లాడిన ప్రతీసారి పప్పు అని సంభోదిస్తూ నాగ్ అవహేళన చేశాడు. టైటిల్ ఫేవరెట్‌గా ముందుకు దూసుకుపోతున్న రేవంత్‌ను నాగ్ పప్పు అని పిలవడాన్ని అతడి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. హౌస్‌లో ప్రతి విషయంలో నోరు పెద్దగా చేసి మాట్లాడటంతో పాటు అందరినీ నిక్ నేమ్స్‌తో పిలుస్తూ రేవంత్ టీజ్ చేస్తుంటాడు.

Read Also: Ananya Panday: అతనికి బ్రేకప్ చెప్పి.. మరో స్టార్ హీరోతో ఎఫైర్

మరోవైపు ఈ వారం ఇంట్లో ఉండేందుకు ఎవరు డిసర్వ్ అనుకుంటున్నారో చెప్పమని సీక్రెట్ రూంలో నాగార్జున హౌస్‌మేట్లను అడగ్గా చాలా మంది శ్రీహాన్ పేరు చెప్పినట్లు ప్రోమోలో కనిపించింది. అన్ డిసర్వ్ మెరీనా అని చాలా మంది తేల్చిచెప్పారు. మరోవైపు ఈ వారం హౌస్ నుంచి స్వయంగా ఎవరో ఒకరు నామినేట్ అవ్వాలని బిగ్‌బాస్ ఆదేశించడంతో ముందుగా శ్రీసత్య ముందుకొచ్చింది. కానీ మళ్లీ ఆమె మనసు మార్చుకుని చీటీలు వేసుకుందామని చెప్పడంతో చీటీలలో వాసంతి పేరు వచ్చింది. దీంతో శ్రీసత్య సేఫ్ అయ్యింది. వాసంతి నేరుగా నామినేట్ అయ్యింది. అంతేకాకుండా హౌస్‌మేట్ల ఓట్ల ప్రకారం వాసంతి జైలుకు కూడా వెళ్లింది. కానీ తాను అందరి కంటే బాగా ఆడానని నాగ్‌కు చెప్పింది. జైలుకు వెళ్తే బాగా ఆడావని ఎలా అనుకుంటావని నాగ్ సూటి ప్రశ్న వేయడంతో వాసంతి బిక్కముఖం వేసింది.