Site icon NTV Telugu

Bigg boss 6: అందరి టార్గెట్ ఆమెనే… ఎందుకంటే..?

Inaya Rehman

Inaya Rehman

Bigg boss 6: బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్స్ ఈ సారి గుంపగుత్తగా ఇనయా రెహ్మాన్‌ను టార్గెట్ చేశారు. దాంతో ఈ వారం నామినేషన్స్‌లో ఏకంగా తొమ్మిది మంది… అంటే హౌస్ లోని సగం మంది కంటెస్టెంట్స్ ఆమెకు ఓట్ వేశారు. కెప్టెన్సీ టాస్క్ కోసం జరిగిన అడవిలో ఆటలో ఇనయా ప్రదర్శించిన దూకుడును చాలామంది జీర్ణించుకోలేక పోయారు. కొందరికి దెబ్బలూ గట్టిగానే తగిలాయి. ఎలాగైనా గెలవాలనే ఉద్దేశ్యంతో ఇనయా కాస్తంత రూడ్ గానే ఈ గేమ్ ఆడిందని, అలానే పలు సందర్భాలలో తన స్ట్రేటజీని మార్చుకుందని, కొన్ని చోట్ల ఫౌల్ గేమ్ ప్లే చేసిందని వీరంతా అభిప్రాయ పడ్డారు. అయితే… తనకు ‘గేమ్ ఇలా ఆడు’ అని చెప్పిన రోహిత్, మరీనా కూడా తననే నామినేట్ చేయడం ఇనయా తట్టుకోలేకపోయింది. ఇతరులు నామినేట్ చేసినప్పుడు నిబ్బరంగా ఉన్నా.. వారి విషయానికి వచ్చే సరికీ ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అలానే రేవంత్ తీరుపైనా కొంతమంది ఇంటి సభ్యులు ఇంకా గుర్రుగానే ఉన్నారు. అతన్ని కూడా ఆరుమంది నామినేట్ చేశారు.

Read Also: Magadheera: ఇప్పుడు రామ్‌చరణ్ వంతు.. ‘మగధీర’ స్పెషల్ షోలు

ఈ వారం హౌస్ మేట్స్ మాత్రమే కాకుండా ఈ ప్రోగ్రామ్ హోస్ట్ అయిన నాగార్జునకూ ఇద్దరిని నామినేట్ చేసే ఛాన్స్ దక్కింది. దాంతో ఇప్పటికే ఆయన అర్జున్ కళ్యాణ్, కీర్తి భట్‌ను నామినేట్ చేశారు. సోమవారం జరిగిన నామినేషన్స్‌లో ఇంటి సభ్యులు ఎంపిక చేసి వారిలో ఇనయా, రేవంత్, ఆరోహి, సూర్య, సుదీప, శ్రీహాన్, గీతు, రాజ్ ఉన్నారు. సో… మొత్తంగా ఈ వారం నామినేషన్స్ జాబితాలో 10 మంది ఉన్నట్టు లెక్క. మరి తమని తాము సేవ్ చేసుకోవడానికి వీరంతా ఈ వారం టాస్క్‌లలో ఎలాంటి ప్రతిభ చూపిస్తారో చూడాలి.

Exit mobile version