తెలుగు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ వాసంతి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. టాలీవుడ్ హీరోయిన్ వాసంతి త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. ఈరోజు వాసంతి నిశ్చితార్థం తాను ప్రేమించిన పవన్ కళ్యాణ్ తో జరిగింది.. ఏపీ తిరుపతిలోని ఓ ఫంక్షన్ హాల్లో గురువారం జరిగిన వీరి ఎంగెజ్మెంట్ వేడుకకు ఇరు కుటుంబసభ్యులతో పాటు.. బుల్లితెర నటీనటులు హజరయ్యారు.. వధూ వరులను అభినందించారు.. వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ఈ అమ్మడు బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్గా అడుగుపెట్టి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. తిరుపతికి చెందిన అమ్మాయి. మోడల్ గా కెరీర్ ఆరంభించి.. సంపూర్ణేష్ బాబు నటించిన క్యాలీఫ్లవర్ లో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత వాంటెడ్ పండుగాడు లో నటించింది. అదే సమయంలో బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి.. తక్కువ సమయంలోనే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాసంతికి సినిమా అవకాశాలు అంతగా రాలేదు. కానీ ఆ తర్వాత బుల్లితెరపై పలు సీరియల్లలో నటించి అలరించింది..
వాసంతికి కాబోయే భర్త పవన్ కళ్యాణ్ టాలీవుడ్ నటుడు. ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ.. చిన్న పాత్రలు చేస్తున్నాడు. నిజానికి వాసంతి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని. ఇప్పుడు ఆమెకు కాబోయే భర్త సైతం పవర్ స్టార్ వీరాభిమాని. అయితే ఇప్పటివరకు జనాలకు అంతగా పరిచయం లేని నటుడు పవన్ కళ్యాణ్.. ఇప్పుడు వాసంతితో నిశ్చితార్థం కావడంతో అందరు అతని గురించి గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు..
View this post on Instagram
A post shared by SUNKARA VEERA VENKATA SURYANARAYANA (@rjsurya_official)