NTV Telugu Site icon

Bigg Boss Telugu7: టేస్టీ తేజ తొమ్మిది వారాలకు ఎంత తీసుకున్నాడో తెలుసా?

Teja

Teja

బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కాస్త కష్టంగా మారింది.. 7 వారాల వరకు హోస్ లో ఉన్న లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు.. ఆ తర్వాత రెండు వారాలు మగవాళ్ళు ఎలిమినేట్ అవుతున్నారు.. గతవారం ఆట సందీప్ ఎలిమినేట్ అవ్వగా, ఈ వారం టేస్టీ తేజ ఎలిమినేట్ అవుతారని వార్తలు వినిపిస్తున్నాయి.. 9 వారాలుగా కొనసాగుతున్న ఈ షో.. రోజు రోజుకు ఆసక్తి కలిగిస్తుంది. ఇక ప్రస్తుతం 12 మంది మిగిలారు..

ఎన్నో వారాలుగా అందరినీ అలరిస్తూ.. వస్తున్న తేజ.. ఈ వారం ఎలిమినేట్ అయిపోయారు. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయింది..ఈ సీజన్ చెప్పినట్లు గానే మొదట 14 మందిని హౌస్ లోకి పంపించి, ఆ తర్వాత వైల్డ్ కార్డు ద్వారామరికొందరిని హౌస్ లోకి పంపించారు..బిగ్ బాస్.. ఇక హౌస్ లో ప్రస్తుతం… 12 మంది మిగిలారు. వీరిలో శివాజీ, గౌతమ్‌, ప్రశాంత్‌, అశ్విని ఈ వారం నామినేషన్స్ లో లేరు. అర్జున్ అంబటి, అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభా శెట్టి, బోలే షవాలి, టేస్టీ తేజ, యావర్, రతికారోజ్ నామినేషన్స్‌లో ఉన్నారు.

తేజ మొదటి నుంచి ఎలిమినేషన్ అంటే భయపడుతూ ఉంటాడు. ఇక ఈ వారం ఆయన ఎలిమినేట్ అయినట్లు బిగ్ బాస్ నిర్వహాకుల నుంచి సమాచారం ప్రకారం తెలుస్తోంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్‌, నామినేషన్స్‌లోకి వస్తే ఆత్మస్థైర్యం పెరుగుతుందంటూ నామినేట్ చేసే తేజ.. అయితే అతని రెమ్యూనరేషన్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది.. 9 వారాలుగా తన ఆటతో అలరిస్తున్న తేజ.. ఇంటికి రూ.13.5 లక్షలు తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. అంటే రోజుకు రూ.21,428వేలు సంపాదించాడు. ఈ లెక్కన తేజ బాగానే వసూలు చేశాడని తెలుస్తోంది.. ఇక నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి..