“బిగ్‌బాస్ హౌస్”లో రానురానూ గొడవలు ఎక్కువవుతున్నాయి. అయితే ఎప్పటికప్పుడు వాటిని అక్కడిక్కడే పరిష్కరించుకోకుండా కొందరు అలాగే కొనసాగిస్తున్నారు. దీంతో ఇంటి సభ్యులు గ్రూపులుగా ఏర్పడి ఒకరితో ఒకరికి సంబంధమే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కానీ టాస్కులు వచ్చినప్పుడు మాత్రం కలిసే ఆడుతున్నారు. అయితే ఆ టాస్కులు కూడా ఇంటి సభ్యుల మధ్య గొడవ పెట్టడానికే అన్నట్టుగా ఉన్నాయి. తాజాగా కెప్టెన్సీ పదవి కోసం ఇచ్చిన టాస్క్ లో శ్రీరామ్, సన్నీ మధ్య విభేదాలు వచ్చాయి.
Rea Also : “సర్కారు వారి పాట” షూటింగ్ పూర్తయ్యేదెప్పుడు ?
ఈరోజు జరిగే ఎపిసోడ్‌లో వారిద్దరూ పెద్ద గొడవకు దిగబోతున్నారు. శ్రీరామ్ “కెప్టెన్ అయ్యి ఉండి నువ్వు చేయాల్సింది ఇదేనా? సన్నీ ఇండిపెండెంట్ ప్లేయర్ అనుకున్నా” అనడం సన్నీకి కోపం తెప్పించింది. అయితే అసలు హౌజ్ లో ఇండిపెండెంట్ గేమ్ ఎవరు ఆడుతున్నారు ? సన్నీ, మానస్, కాజల్… మానస్, ప్రియా… ఇక త్రిమూర్తులు… వీళ్లంతా కలిసే గేమ్ ఆడుతున్నారు. మిగిలిన వాళ్లలో రవి గేమ్ ప్లేయర్ అని గత వారం నాగార్జున స్వయంగా వెల్లడించాడు. ఇక మిగిలింది లోబో, విశ్వా, యాని మాస్టర్, శ్రీరామ్. లోబో ఒక్కరికో ఒకరికి సపోర్ట్ ఇచ్చినప్పటికీ మిగతా ముగ్గురూ సోలోగానే గేమ్ లో నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం షో జోరుగా సాగుతోంది. అప్పుడే 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ షోలో ఇంకా నలుగురే అమ్మాయిలు మిగిలారు. లోబో ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.