“బిగ్ బాస్ 5″లో 6వ వారం ఎలిమినేషన్ టైం వచ్చేసింది. ఆరవ వారానికి గానూ నామినేషన్లలో ఏకంగా 10 మంది ఉన్నారు. అయితే ఈ వారం షణ్ముఖ్, శ్రీరామ్ వంటి బలమైన కంటెస్టెంట్లు ఎలిమినేషన్ కోసం నామినేషన్లలోకి రాగా, కాజల్, యాని మాస్టర్ వంటి కంటెస్టెంట్లు తప్పించుకున్నారు. విశ్వ, జెస్సీ, రవి, మానస్, ప్రియాంక, లోబో, సిరి, సన్నీ, శ్వేత, శ్రీరామ చంద్ర ఈవారం నామినేటెడ్ కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారు. అయితే పరిస్థితి చూస్తుంటే ఈవారం డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశం కన్పిస్తోంది.
Read Also : ఇక మీడియాకు మంచు విష్ణు దూరం!
తాజా సమాచారం ప్రకారం ఈ రోజు సాయంత్రం శ్వేత ఎలిమినేట్ కానుంది. నిజానికి హౌజ్ మేట్స్ అందరిలో శ్వేత, విశ్వకు అతి తక్కువ ఓట్లు వచ్చాయని అన్నారు. కానీ విశ్వ ఈ వీక్ కెప్టెన్ గా మరోసారి ఎన్నిక కావడంతో ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నాడు. కానీ ప్రస్తుతానికి శ్వేత వర్మకు అతి తక్కువ ఓట్లు ఉన్నాయని, కాబట్టి ఆమె ఈ రోజు ఎలిమినేట్ అవుతుందని సమాచారం.