ఇక మీడియాకు మంచు విష్ణు దూరం!

శనివారం ఎఫ్.ఎన్.సి.సి.లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మంచు విష్ణు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘మా’ ఎన్నికలు ముగిసిన దృష్ట్యా ఇక పై తాను, తన కమిటీ సభ్యులు ఎవరూ మీడియా ముందుకు రాబోమని ప్రకటించారు. ఓ యేడాదితో తాము ఏం చేయబోతున్నామో చెప్పడానికి మాత్రమే మీడియా ముందుకు వస్తామని, ముగిసిన ఎన్నికల గురించి మాత్రం పెదవి విప్పమని అన్నారు. ఎన్నికల సందర్భంగా తాను గెలవాలని కొందరు పూజలు చేశారని, వాటిని టీవీల్లో చూశానని, అలానే కొందరూ తమను ఏడిపించారు కూడానని విష్ణు అన్నారు.

Read Also : మెగా ఫ్యామిలీపై మోహన్ బాబు సెటైర్స్

‘మా’ గత అధ్యక్షులు నరేశ్ సైతం ఇకపై తాను మంచిని గురించి మాత్రమే మాట్లాడతానని, ఏదైనా విమర్శ తన దృష్టికి వస్తే మీడియాలో కాకుండా సంబంధితుల చెవిలో చెబుతానని తెలిపారు. అయితే…’రెండు మూడు రోజుల్లో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు ఒకవేళ కోర్టును ఆశ్రయిస్తే… అప్పుడైనా విష్ణు మీడియా ముందుకు రావాల్సివస్తుంది కదా!’ అని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు!

Related Articles

Latest Articles