NTV Telugu Site icon

బిగ్ బాస్ 5 : శ్రీరామ్ కు సెలెబ్రిటీల సపోర్ట్… టైటిల్ గెలుస్తాడా ?

Sriramachandra

Sriramachandra

బుల్లితెర రియాలిటీ షో “బిగ్ బాస్ 5” ఆసక్తికరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న 5వ సీజన్‌లో బిగ్ బాస్ తెలుగు టైటిల్‌ను గెలుచుకునే టాప్ 5 కంటెస్టెంట్స్ లో పాపులర్ సింగర్, నటుడు శ్రీరామ చంద్ర కూడా ఒకరు. శ్రీరామ్‌కు సోషల్ మీడియాలో, మొబైల్ ఓటింగ్ ద్వారా సపోర్ట్ ఇస్తున్న ఫాలోవర్ల సంఖ్య భారీగానే ఉంది. ఇదిలా ఉంటే శ్రీరామ చంద్రకి కొంతమంది ప్రముఖులు కూడా తమ సపోర్ట్ ను ఇస్తున్నారు. ఇప్పటికే యంగ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ శ్రీరామ చంద్రకు తన సపోర్ట్ అని బహిరంగంగా తెలియజేసింది. గ్రాండ్ ఫినాలేలో శ్రీరామ్ టైటిల్‌ను కైవసం చేసుకోవడానికి తన అభిమానులు ఆయనకు ఓటు వేయాలని కోరింది. ఇప్పుడు ప్రముఖ హిందీ కమెడియన్ భారతీ సింగ్ తన స్నేహితుడైన శ్రీరామ చంద్రకు ఓటు వేయమని తన అభిమానులను అడుగుతూ సోషల్ మీడియాలో ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది.

Read Also : బిగ్ బాస్ 5 : అసలు ఇండిపెండెంట్ ప్లేయర్ ఎవరు ? సన్నీ, శ్రీరామ్ వార్ !

శ్రీరామ చంద్ర ఇండియన్ ఐడల్ విజేత. అంతేకాదు ఆయనకు టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌ దాకా మంచి పరిచయాలు ఉన్నాయి. రానురానూ శ్రీరామ్ కు సెలెబ్రిటీల సపోర్ట్ పెరిగే అవకాశం ఉంది. అయితే గ్రాండ్ ప్రైజ్‌తో శ్రీరామ్ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్లేందుకు సెలబ్రిటీల సపోర్ట్ సహాయ పడుతుందా లేదా అనేది చూడాలి.