బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ ప్రస్తుతం పదవ వారం నడుస్తోంది. గత వారం విశ్వ ఎలిమినేట్ అయ్యి అందరికీ షాక్ ఇవ్వగా, తాజాగా అనారోగ్యం కారణంగా జశ్వంత్ పడాల హౌస్ నుంచి బయటకు వచ్చాడు. జెస్సి సీక్రెట్ రూమ్ లో ఉన్నాడు. ప్రస్తుతం హౌస్ లో తొమ్మిది మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉండగా అందులో ఐదుగురు నామినేషన్లలో ఉన్నారు. ఇదంతా ఇలా ఉండగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కు బయట సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. అంతేకాదు సెలబ్రిటీల నుంచి కూడా సపోర్ట్ వస్తోంది. ముఖ్యంగా సింగర్ శ్రీరామచంద్రకు సెలబ్రిటీల సపోర్ట్ గట్టిగా ఉంది.
Read Also : “అఖండ” ట్రైలర్ కు ముహూర్తం ఖరారు
ఇండియన్ ఐడల్ విజేతగా నిలిచిన ఈ టాలెంటెడ్ సింగర్ కు ప్రముఖులతో మంచి పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాలు ఇప్పుడు సపోర్ట్ గా మారుతున్నాయి. తాజాగా శ్రీరామ్ కు రియల్ హీరో సోనూ సూద్ చేయడం విశేషం. “బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో శ్రీరామ్ ను చూస్తున్నారా? నేను చూస్తున్నాను. షోలో నీ బెస్ట్ ఇవ్వు శ్రీరామ్. అతడికి నా ప్రేమాభినందనలు… లవ్ యు మ్యాన్” అంటూ సోనూ వీడియోలు షేర్ చేశారు. ఆ వీడియోను చూసిన వారు ఈ సీజన్ విన్నర్ గా శ్రీరామ్ గెలవడం ఖాయం అని అంటున్నారు.