NTV Telugu Site icon

షణ్ణూ మదర్ కూడా అదే చెప్పింది!

Shanmukh

Shanmukh

బిగ్ బాస్ సీజన్ 5లో ఫ్రెండ్ షిప్ ముసుగులో టాస్క్ లు ఆడి అడ్వాంటేజ్ పొందటమే కాదు, మానసికంగా కాస్తంత వీక్ అయినప్పుడల్లా ఒకరికి ఒకరు హగ్గులు ఇచ్చి, ముద్దులు పెట్టుకుని కొందరు బాగానే సపోర్ట్ చేసుకున్నారు. ఆ జాబితాలో మొదటి పేరు షణ్ముఖ్ – సిరి లదే! చిత్రం ఏమంటే… అయిన దానికి కాని దానికి కూడా అలిగి హగ్గులు పెట్టుకొరి ఓదార్చుకోవడం వారికే చెల్లింది. బట్ వాళ్ళ పెద్దలకు మాత్రం ఇది భరించరానిదిగా అనిపించింది.

Read also : మరో స్టార్ హీరోయిన్ బలి… సర్జరీతో అందం నాశనం అంటూ ట్రోలింగ్

మొన్న సిరి తల్లి తాను ఎన్నో మాటలు పడి, భరించి పాన్ షాప్ నడుపుతూ కూతుర్ని పెంచానని, తాను పడిన మాటలు తన కూతురు పడకూడదని చెప్పింది. షణ్ముఖ్ తో కౌగిలింతలు తగదని హితవు పలికింది. తల్లిగా ఆమె అభిప్రాయాలను తాను గౌరవిస్తానని అప్పుడు చెప్పిన షణ్ముఖ్ కు శుక్రవారం వాళ్ళ అమ్మ ఉమారాణి మరో షాక్ ఇచ్చింది. ఈ దెబ్బ నుండి కుర్రాడు ఇంకా కోలుకోలేదు. కలిసి ఆడటంతో అర్థం ఉంది కానీ అవసరంగా చిన్న చిన్న విషయాలకు అలగడం, ఒకరిని ఒకరు ఓదార్చుకోవడం, ఆ క్రమంలో బిగి కౌగిలింతలు… ఇలాంటివి కరెక్ట్ కాదని ఇన్ డైరెక్ట్ గా షణ్ముఖ్ కు ఆమె చెప్పేసింది. షణ్ముక్‌ తో సిరి తల్లి ఎలా అంటీ ముట్టనట్టుగా ఉందో, షణ్ముఖ్ మదర్ కూడా సిరితో అలానే వ్యవహరించింది. అందరితో స్నేహంగా ఉండాలి తప్పితే ఒకరితో ఎక్కువ స్నేహంగా ఉండటం కరెక్ట్ కాదని కుండబద్దలు కొట్టేసింది. ఆ మాట సిరిని ఉద్దేశించే కొడుకుకు చెప్పిందని ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు.

ఇక దీప్తి సునయన తన ఆట పట్ల ఎలా రియాక్ట్ అవుతోందనే షణ్ణు అడిగిన ప్రశ్నకు ఆమె సరైన జవాబు ఇవ్వలేదు. ఆమెను కలిశానని మాత్రం చెప్పంది. అయితే దీప్తి రియాక్షన్ గురించి పెదవి విప్పలేదు. మాలాగే తనూ అనుకుంటోంది అని మాత్రమే చెప్పింది. అంటే బిగ్ బాస్ హౌస్ లో షణ్ణు – సిరి ఒకరికి ఒకరు దగ్గర అవడం అతని కుటుంబ సభ్యులకే కాదు, దీప్తి సునయనకూ నచ్చడం లేదనేది అర్థమౌతోంది. బరి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఆమెను షణ్ణు ఎలా కన్వెన్స్ చేస్తాడో చూడాలి. ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళిపోతూ షణ్ణు మదర్ అతన్ని మెంటల్లీ వీక్ కావద్దని, సోలోగా ఆట ఆడమని సలహా ఇచ్చింది. మరి ఆమె మాటలను షణ్ణు ఎంతవరకూ మనసుకు తీసుకుంటాడు అనేది రాబోయే రోజుల్లో చూడాలి.