‘బిగ్ బాస్-5’ తెలుగు టీవీ షో 12 వారాలు పూర్తి చేసుకుంది. ఈరోజుతో 13వ వారంలోకి అడుగుపెట్టింది. మరో మూడు వారాల్లో షో ముగిసి విజేత ఎవరో తేలుతుంది. ప్రస్తుతం ఇంట్లో 7 మంది సభ్యులు ఉన్నారు. గత వారం నామినేషన్లలో ఉన్న రవి ఎవరూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యాడు. రవి ఎలిమినేషన్ ప్రేక్షకులకు పెద్ద షాక్. టీవీ షో ఐదవ సీజన్‌లో పోటీదారులందరిలో రవి అత్యంత ప్రజాదరణ పొందిన సెలబ్రిటీ. కానీ అతను ఈ సీజన్‌లో ఫైనల్స్ లో లేకుండానే బయటకు వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇన్‌ఫ్లుయెన్స్ స్టార్ అని, గుంట నక్క అని పిలిచినప్పటికీ రవి 12 వారాలు హౌస్ లో ఉండగలిగాడు. రవి తన ఆటను బాగా ఆడాడు.
Read Also : శివ శంకర్ మాస్టర్ మృతిపై రాజమౌళి ట్వీట్, ప్రముఖుల సంతాపం
నిజానికి రవి టాప్ 5లో చోటుకి అర్హుడు. అయితే ఆశ్చర్యకరంగా ఇప్పుడు టీవీ షో నుండి ఎలిమినేట్ అయ్యాడు. తాజాగా ఈ విషయంపై స్పందించిన యాంకర్ రవి ట్వీట్ చేస్తూ హార్ట్ బ్రేకింగ్ అని చెప్పాడు. “హార్ట్ బ్రేకింగ్ మూమెంట్… స్టార్టింగ్ నుంచి మొన్నటి వరకు నామినేట్ అయినా ప్రతీ వీక్ ఓట్లు వేసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా థాంక్యూ సో మచ్” అంటూ ఎలిమినేషన్ పై తన మనోభావాలను వ్యక్తపరిచారు. రవి వెళ్లిపోవడంతో ప్రస్తుతం హౌజ్ లో సన్నీ, మానస్, కాజల్, శ్రీరామ్, షణ్ముఖ్, సిరి, ప్రియాంక సింగ్ ఉన్నారు.