Site icon NTV Telugu

బిగ్ బాస్ 5 : కాజల్ తో రవి గొడవ… ఎక్కడికి దారి తీస్తోంది ?

Ravi big fight with Kajal in Bigg Boss 5

వివాదాలతో “బిగ్ బాస్ 5” 5వ వారం వాడివేడిగా సాగుతోంది. రవి, సన్నీని రాజకుమారులుగా ప్రకటించిన బిగ్ బాస్ ఇంటిలోని సభ్యులను రెండు జట్లుగా విడదీసి, వారిచేత వివిధ టాస్కులను ఆడించారు. అనంతరం ఈ వారానికి గానూ రవి టీంలో ఉన్న ప్రియా కెప్టెన్ అయ్యింది. వారి గెలుపుతో సన్నీ అసంతృప్తికి గురయ్యి ఎమోషనల్ అయ్యాడు. ఇలా హౌజ్ లో ఆట రోజుకో మలుపు తిరుగుతోంది. అయితే యాంకర్ రవి బిగ్ బాస్ హౌస్‌లో తెలివిగా గేమ్ ఆడుతున్నారు. కాజల్ గురించి రవి పాజిటివ్ గానే మాట్లాడాడు. కానీ వరెస్ట్ పెర్ఫార్మర్ ఎవరు? అనే విషయానికి వచ్చే సరికి గొడవ మొదలైంది. గార్డెన్ ఏరియాలోని నెక్ లాక్ లో ఎవరి పేరైతే చెబుతారో వారిని తలను అందులో పెట్టి, కారణం చెప్పి, గ్లాసుడు నీళ్ళు వాళ్ళ ముఖం మీద కొట్టాలి. ఇదీ ప్రాసెస్. అందులో ఎక్కువ మంది కాజల్ పేరే చెప్పడం గమనార్హం. గత వారం రోజులుగా ఇంటి సభ్యుల ప్రవర్తన, తమతో మెలిగిన తీరును బట్టి ఎక్కువ మంది కాజల్ ను టార్గెట్ చేశారు.

Read Also : మరో సినిమాలో నుంచి కాజల్ అవుట్

హౌజ్ లో ఎక్కువగా కాజల్, రవి ఇద్దరూ గట్టిగానే గొడవలు పడుతున్నారు. ఈ వారం మొదట్లో కూడా కాజల్, రవి మధ్య పెద్దగానే గొడవ జరిగింది. నిన్న కూడా అలాగే జరిగింది. అయితే ఇద్దరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లు కావడం విశేషం. మరి ఈ ఇద్దరి గొడవ ఎక్కడికి దారి తీస్తుంది ? ఎవరిపై ఆ ఎఫెక్ట్ పడుతుంది? రాబోయే వారం నామినేషన్లు మరింత హాట్ గా జరగనున్నాయి. అందులో ఎవరెవరు నామినేట్ అవుతారు? అనేది చూడాలి.

Exit mobile version