“బిగ్ బాస్ 5″కు బుల్లితెరపై మంచి పాపులారిటీ ఉంది. ఇతర ఛానళ్లలో ఈ షోతో పోటీ పడుతున్న షోలు వెనకపడడం చూస్తూనే ఉన్నాము. అయితే ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లు భారీగా రెమ్యూనరేషన్ ను అందుకుంటున్నారు. ఈ సీజన్ లో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న కంటెస్టెంట్ షణ్ముఖ్ అని సోషల్ మీడియా కోడై కూసింది. ఈ విషయం పక్కన పెడితే గత వారం ఎలిమినేట్ అయిన నటి ప్రియ రెమ్యూనరేషన్ విషయం రివీల్ అయ్యింది. పలు తెలుగు చిత్రాలతో పాటు సీరియళ్ళలో కూడా మెరిసిన ప్రియా ఈ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొంది. ఈ షోలో పాల్గొన్న ఆమెకు ప్రజాదరణ ఖచ్చితంగా తదుపరి స్థాయికి చేరుకుందని చెప్పొచ్చు.
Read Also : వైరల్ : ఆమె బాత్రూంలో నేనేందుకు ఉంటా ?… ప్రభాస్ నెవెర్ బిఫోర్ పంచులు
కాగా ‘బిగ్ బాస్ 5’ షోలో ఒక్కో ఎపిసోడ్‌కు ప్రియా 3.2 లక్షలు పారితోషికం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు ఏడు వారాల పాటు అక్కడే ఉండి 23 లక్షలకు చేరువలో సంపాదించింది ఈ బ్యూటీ. ఇప్పటికే తెలుగు చిత్రసీమలో బిజీ ఆర్టిస్ట్ అయిన ప్రియా ఇక నుంచి తన కెరీర్‌ను ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి. ప్రస్తుతానికి బిగ్ బాస్ షోతో, అది తెచ్చిన పాపులారిటీతో ప్రియా సంతోషంగా ఉంది.