NTV Telugu Site icon

హౌస్ మేట్స్ త్యాగాన్ని గౌరవించిన బిగ్ బాస్!

Bigg-Boss-5

Bigg-Boss-5

కొద్ది రోజుల క్రితం బిగ్ బాస్ ఇంటి సభ్యుల గుండెలు బ్రద్దలయ్యేలా ఓ టాస్క్ ను ఇచ్చాడు. ఇద్దరేసి సభ్యులను జంటగా పెట్టి, అందులో ఒకరికి మాత్రమే తమ వాళ్ళు పంపిన లేఖను చదువుకునే అవకాశం ఇచ్చాడు. అంతేకాదు… వచ్చిన లేఖను వదులు కోవడంతో పాటు వాళ్ళు నామినేషన్స్ లోనూ ఉంటారని చెప్పాడు. విశేషం ఏమంటే… ఎదుటి వ్యక్తి భావోద్వేగాలను గౌరవించి తమ ప్రియమైన వారి నుండి వచ్చిన లేఖలను వదులుకోవడానికి షణ్ముఖ్, మానస్, రవి, లోబో, సిరి రిస్క్ చేశారు. వారి త్యాగం వృధా కాలేదు. బిగ్ బాస్ ఆదివారం దీపావళి స్పెషల్ ఎపిసోడ్ సందర్భంగా ఈ ఐదుగురుకి ఓ కానుకగా ఆ లేఖలను అందించాడు. షణ్ముఖ్ కు అతని తల్లిదండ్రులు లేఖ రాశారు. దానిని చదువుతూ అతను కన్నీటి పర్యంతం కావడంతో సిరి చదివింది. మొదటి నుండి షణ్ణుకు నటన పట్ల ఆసక్తి ఉన్నా తాము పెద్దంతగా ప్రోత్సహించలేదని వారు ఆ లేఖలో తెలిపారు. ఇవాళ అదే నటనతో షణ్ణు పేరు తెచ్చుకోవడం గర్వంగా ఉందని చెప్పారు. ఇక సిరికి అతని బోయ్ ఫ్రెండ్ శ్రీహాన్ లేఖ రాయగా, లోబోకు అతని భార్య ఉత్తరం రాసింది. ఇక మానస్, రవిలకూ వారి ఫ్యామిలీ మెంబర్స్ లేఖలు రాసి, తమ యోగక్షేమాలను తెలిపారు. ప్రతి ఒక్కరూ బిగ్ బాస్ టైటిల్ తో తిరిగి రమ్మనే కోరారు. మొత్తం మీద దీపావళికి మూడు రోజుల ముందే ఈ త్యాగమూర్తులకు లేఖలు అందించి, వారి కళ్ళలో బిగ్ బాస్ వెలుగులు నింపాడు.

Read Also : “భోళా శంకర్” కోసం మిల్కీ బ్యూటీ… భారీ రెమ్యూనరేషన్