NTV Telugu Site icon

కెప్టెన్ కాకుండానే బయటకు వస్తున్న ఆ ఇద్దరూ!

Bigg-Boss5

Bigg-Boss5

బిగ్ బాస్ సీజన్ 5లో చివరి కెప్టెన్ గా పలు నాటకీయ పరిణామాల మధ్య షణ్ముఖ్ ఎంపికయ్యాడు. దాంతో చివరి వరకూ గట్టి పోటీ ఇచ్చిన కాజల్, ప్రియాంక లకు ఎదురుదెబ్బ తగిలింది. చిత్రం ఏమంటే సిరి బిగ్ బాస్ హౌస్ లో ఫస్ట్ కెప్టెన్ కాగా, షణ్ముఖ్ లాస్ట్ కెప్టెన్ గా నిలిచాడు. ఇక ప్రస్తుతం హౌస్ లో ఉన్న వారిలో ప్రియాంక, కాజల్ కెప్టెన్ కాకుండానే ఈ షో నుండి బయటకు రాబోతున్నారు. నిజానికి మంగళవారం నాటి ఎపిసోడ్ లో కాజల్, బుధవారం నాటి ఎపిసోడ్ లో ప్రియాంక ఇద్దరూ ఇదే విషయాన్ని తమ తోటి కంటెస్టెంట్స్ ముందు పెట్టి తమని సేవ్ చేయమని కోరారు. కానీ వారి వాదనలను ఎవరూ పట్టించుకోలేదు. ఇక ప్రియాంక ట్రాన్స్ జండర్ కాబట్టి ఆమె కమ్యూనిటీకి గుర్తింపు ఇస్తూ సేవ్ చేయమని కాజల్ షణ్ముఖ్ ను కోరింది. దాన్ని అతను ఖండించాడు. అలా కమ్యూనిటీ ఫీలింగ్ ను తీసుకురావడం తప్పు అని గట్టిగా వాదించిన షణ్ముఖ్, ఆ తర్వాత కన్నీరు పెట్టుకోవడం చిత్రంగా అనిపించింది.

Read Also : “ఆర్ఆర్ఆర్” ట్రైలర్, వరుస ఈవెంట్స్.. హింట్ ఇచ్చిన రాజమౌళి

ఇదే విషయంలో తనకు ఎవరూ సాయం చేయడం లేదంటూ ప్రియాంక కళ్ళ నీళ్ళు పెట్టుకున్నప్పుడు ‘కెప్టెన్ కాకుండా షో లోంచి వెళ్ళిపోవడంలోని పెయిన్ తనకు అర్థమౌతుంది’ అని కాజల్ ఓదార్చే ప్రయత్నం చేసింది. ఓవర్ ఆల్ గా కెప్టెన్ అయ్యే విషయంలో కాజల్, ప్రియాంకకు లక్ కలిసి రాలేదనే చెప్పాలి. ఇక బుధవారం నాటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ బీబీ ఎక్స్ ప్రెస్ గేమ్ మధ్యలో ఇంటి సభ్యులకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ను హౌస్ లోకి ప్రవేశ పెట్టాడు. అలా మొదటగా ఆర్జే కాజల్ భర్త విజయ్, కూతురు హర్షిత హౌస్ లోకి వచ్చి కాజల్ తో ఓ గంటసేపు గడిపి వెళ్ళారు. గురు, శుక్రవారాలలో మిగిలిన ఇంటి సభ్యులలో రవి తరఫున అతని భార్య, కూతురు; శ్రీరామ్ చంద్ర సోదరి, సన్నీ ఫాదర్, మానస్, షణ్ముఖ్, సిరి, ప్రియాంక వాళ్ళ మదర్స్ బిగ్ బాస్ హౌస్ లోకి రాబోతున్నారని తెలుస్తోంది.