NTV Telugu Site icon

ఖరీదైన కారు కొన్న “బిగ్ బాస్ 5” కంటెస్టెంట్… నెటిజన్లు ఫైర్

Bigg-Boss-5

Bigg-Boss-5

“బిగ్ బాస్ 5” షో ముగింపు దశకు చేరుకుంది. ఈ సీజన్ లో హౌజ్ లోకి వెళ్లిన స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో విశ్వా ఒకరు. అయితే బాడీ బిల్డర్ విశ్వకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటి ఆయన అర్ధాంతరంగా బయటకు వచ్చేశాడు. వాస్తవానికి విశ్వ ఇంత త్వరగా బయటకు వస్తాడని ఎవరూ ఊహించలేదు. విశ్వ ఎలిమినేషన్ అందరికీ షాకిచ్చింది. అయితే తాజాగా హౌస్ లో ఆయన చెప్పిన దానికి, బయటకు వచ్చాక ఆయన చేస్తున్న దానికి పొంతన కుదరకపోవడంతో విశ్వాపై అసంతృప్తి వ్యక్తం అవుతోంది.

Read Also : లేడీ వ్యాపారవేత్త వలలో టాలీవుడ్ హీరోలు… 200 కోట్ల కుచ్చు టోపీ

విశ్వా తాను కొత్తగా కొనుగోలు చేసిన బిఎండబ్ల్యు కారు చిత్రాలను సోషల్ మీడియా పేజీలో షేర్ చేసుకున్నాడు. దీంతో ఆ ఫొటోలను చూసి నెటిజన్లు మండి పడుతున్నారు. ఎందుకంటే “బిగ్ బాస్” హౌస్ లో ఉన్నప్పుడు విశ్వా హౌస్ లోన్ క్లియర్ చేయడానికి, తన కొడుకు స్కూల్ ఫీజు చెల్లించడానికి డబ్బు సంపాదించడానికి తాను ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు. తాను ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల గురించి పలుమార్లు చెప్పుకొచ్చాడు. కానీ బయటకు వచ్చాక మాత్రం BMW M సిరీస్ X3 M స్పోర్ట్‌ కారును కొనుగోలు చేశాడు. మరి అంత ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఆయన కారును ఎలా కొనుగోలు చేశాడు ? అని అడుగుతున్నారు. ఒకవేళ అది సెకండ్ హ్యాండ్ కార్ అయినప్పటికీ కనీసం 60 లక్షలు ఖర్చవుతుంది. దీంతో ‘బిగ్ బాస్’లో విశ్వా మాట్లాడింది, బయట అతను చేసిన పనులపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.