Site icon NTV Telugu

బిగ్ బాస్ 5 : చిరాకు పెట్టేస్తున్న లహరి

Lahari

“బిగ్ బాస్ 5” ప్రారంభమై 4 ఎపిసోడ్లు గడిచాయి. కంటెస్టెంట్స్ ఎవరి పెర్ఫార్మన్స్ లో వారు ఉన్నారు. అయితే కొంతమంది మాత్రం స్క్రీన్ స్పేస్ దక్కించుకోవడంలో విఫలం అవుతున్నారు. లహరి వంటి కంటెస్టెంట్ల దూకుడును వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అయితే లహరి బిహేవియర్ ప్రేక్షకులను తెగ చిరాకు పెట్టేస్తోంది. ఆమె దాదాపుగా నోరు తెరిచిందంటే గొడవే. ఈ నాలుగు రోజుల ఎపిసోడ్ లో చెప్పుకోవాల్సింది ఏమన్నా ఉందా ? అంటే.. ఒకటి ఏడుపు, రెండు గొడవలు. కంటెస్టెంట్స్ అందరిలో లోబోనే అంతో ఇంతో ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఆయనది కూడా ఓవర్ యాక్షన్ అనే వాళ్ళు లేకపోలేరు. అయినప్పటికీ లోబో తనవంతుగా సీరియస్ మేటర్ ను కూడా తనదైన కామిక్ వేలోనే సాల్వ్ చేసేసుకుంటున్నాడు.

Read Also : బిగ్ బాస్ 5 : మెగా బ్రదర్ సపోర్ట్ ఎవరికంటే ?

ఇక విషయంలోకి వస్తే మనం లహరి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆమె హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే వరకూ ప్రేక్షకులకు పెద్దగా తెలీదు. ఇక ఎంట్రీ ఇచ్చిన మొదటి నుంచీ ఎవరితోనో ఒకరితో గొడవ పడుతూనే ఉంది. హౌజ్ మేట్స్ అందరిపై ఆమె నోరు పారేసుకోవడం ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు. మేకర్స్ కూడా ఆమె గొడవపైనే ఎక్కువ ఫోకస్ చేస్తుండడం గమనార్హం. లహరి ఈ వారం నామినేషన్లలో లేదు. బహుశా అందుకే ఆమె అంత ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉందేమోనని అనుకుంటున్నారు నెటిజన్లు. కాజల్, హమీదా వంటి ఇతర హౌస్‌మేట్‌లతో తరచుగా ఆమె గొడవలు పడడం, సమస్యలను సాగదీస్తున్న తీరు ఇబ్బందికరంగా మారింది. మునుపటి ఎపిసోడ్‌లో ఆమె కాజల్‌ని టార్గెట్ చేసింది. ఆమె కంటెంట్ కోసం అన్నీ చేస్తోందని ఆరోపించింది. ఆ గొడవ తర్వాత కాజల్ సైలెంట్ అయ్యింది. ఈ రోజు ఆమె హమీదాతో ఫైట్ మొదలు పెట్టింది. అది హమీదా కన్నీళ్లు పెట్టుకోవడంతో ముగిసింది. మరి ఈ భామ హౌజ్ లో ఎక్కువ రోజులు కొనసాగితే రణరంగమే.

Exit mobile version