బిగ్ బాస్ 5 : మెగా బ్రదర్ సపోర్ట్ ఎవరికంటే ?

“బిగ్ బాస్” అనేది సాధారణ ప్రజలతో పాటు ప్రముఖులు సైతం ఫాలో అయ్యే పాపులర్ రియాలిటీ షో. దర్శకుడు అనిల్ రావిపూడి వంటి చాలా మంది ప్రముఖులు ఇంతకు ముందు ఈ షోకి ఎంత పెద్ద అభిమానులు అనే విషయాన్ని వెల్లడించారు. ఇక మెగా బ్రదర్ నాగబాబు గత సీజన్ నుంచి ఎవరికో ఒకరికి తన సపోర్ట్ ను ఇస్తూనే ఉన్నారు. సాధారణంగా ఆయన బిగ్ బాస్ హౌస్ లో ఎవరికీ మద్దతిస్తారో కూడా బహిరంగంగానే వెల్లడిస్తాడు. గత సీజన్‌లో అతను అభిజీత్‌కు మద్దతు ఇచ్చాడు. అప్పుడు అభిజీత్ టైటిల్ విన్నర్ అయ్యాడు. ఇప్పుడు కూడా నాగబాబు ఈ సీజన్‌లో తనకు ఇష్టమైన కంటెస్టెంట్ గురించి వెల్లడించాడు.

Read Also : మూడో రోజు వినోదం తక్కువ… విషాదం ఎక్కువ!

ఇటీవల “బిగ్ బాస్ 5″పై నాగబాబు వ్యాఖ్యానించారు. తనకు యాంకర్ రవి, యానీ మాస్టర్, సింగర్ శ్రీరామ్, ప్రియ, నటరాజ్ మాస్టర్ అంటే ఇష్టమని ఆయన చెప్పారు. కానీ ట్రాన్స్-ఉమెన్ ప్రియాంకకు తన పూర్తి మద్దతును అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రియాంక తన కెరీర్‌ని ‘జబర్దస్త్‌’తో సాయి తేజగా ప్రారంభించి, తర్వాత ట్రాన్స్ జెండర్ గా మారిన విషయం తెలిసిందే. ఆమె శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు. ప్రియాంక జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కొన్నట్లు నాగబాబు చెప్పారు. అమ్మాయిగా మారిన తర్వాత ఆమెకు అవకాశాలు రానప్పుడు నాగబాబు ఎలా సహాయం చేశాడో కూడా గుర్తు చేసుకున్నాడు. ప్రియాంకకే తన పూర్తి సపోర్ట్ ఉంటుందని నాగబాబు అన్నారు. ఈ షోలో ప్రియాంక తనదైన ముద్రను వేసుకుంటుందో లేదో వేచి చూడాలి.

Related Articles

Latest Articles

-Advertisement-