మూడవ వారం వీకెండ్ కు చేరుకున్న “బిగ్ బాస్ 5” ఆసక్తికరంగా మారుతోంది. హౌజ్ లో నడుస్తున్న ట్రాక్ లు షోపై ఇంట్రెస్ట్ పెంచుతున్నాయి. శుక్రవారం రాత్రి జరిగిన ఎపిసోడ్ లో శ్రీరామచంద్ర, హమీదా ట్రాక్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నిన్నటి ఎపిసోడ్ లో హమీదా ఇన్ డైరెక్ట్ హింట్ ఇవ్వడం, శ్రీరామ్ దాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. నిన్న ఉదయం ఎపిసోడ్ లో మానస్ హామీదకు ఆహరం తినిపించాడు. అప్పుడు లహరి చాలా బాధ పడుతోందని హమీదాతో మానస్ చెప్పుకొచ్చాడు. రాత్రి హమీదా, శ్రీరామ్ వంటగదిలో ఉన్నారు. వాళ్లిద్దరూ కలిసి తింటున్న సమయంలో హమీదా మాట్లాడుతూ “మానస్, సన్నీ నాకు ఆహారం రియాక్ట్ అవుతున్నానో ? నేను మీతో ఎలా ఉంటున్నానో మీకు తేడా తెలియదా?” అని శ్రీరామ్ ను ప్రశ్నించింది. హమీద మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న అడగ్గా శ్రీరామ్ సమాధానమిస్తూ “నువ్వు వారితో ఎలా ఉన్నావో నేను పట్టించుకోను. వాళ్ళతో స్నేహం చేస్తున్నావంటే ఖచ్చితంగా మీకు వైబ్ ఉంటుంది. నేను దాని గురించి బాధపడటం లేదు” అని అన్నాడు.
Read Also : ఆకాష్ పూరి “రొమాంటిక్” రిలీజ్ కు ముహూర్తం ఖరారు
హమీదా డైరెక్ట్ గానే ఇలా శ్రీరామ్ ను ప్రశ్నించినప్పటికీ శ్రీరామ్ స్పందించకపోవడం ఆయన గేమ్ అనుకోవాలా ? లేదంటే అతనికి నిజంగానే అర్థం కాలేదా ? అని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. ముందుగా ఆమెతో సన్నిహితంగా ఉన్న శ్రీరామ్ ఇప్పుడు హమీద ఇలా మాట్లాడినప్పటికీ పెద్దగా పట్టించుకోకపోవడం చూస్తే అతను తెలివిగా గేమ్ ఆడుతున్నాడని అంటున్నారు కొందరు.