“బిగ్ బాస్” తెలుగు ఓటిటి వెర్షన్ రెడీ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“బిగ్ బాస్ తెలుగు సీజన్ 5” రెండు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షో లాంచ్ ఎపిసోడ్‌కు మంచి టీఆర్పీ రేటింగ్ కూడా వచ్చింది. తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇతర షోలన్నింటినీ పక్కకు నెట్టేసింది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు త్వరలో తొలి ఓటిటి వెర్షన్ రానున్నట్లు వినికిడి. ప్రస్తుతం సాగుతున్న “బిగ్ బాస్ సీజన్ 5” ఈ ఏడాది చివరి వారంలో ముగుస్తుంది. మేకర్స్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఓటిటి వెర్షన్‌ని లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Read Also : కనికరించండి… ఏపీ సీఎంకు చిరు రిక్వెస్ట్
Also Read
ఈ ఓటిటి వెర్షన్ ఆరు వారాల పాటు నడుస్తుంది. వివిధ వృరంగాల ప్రముఖులు ఈ షోలో భాగం కానున్నారు. ఓటిటి వెర్షన్ ఫైనలిస్టులలో ఒకరు టెలివిజన్ వెర్షన్, అంటే “బిగ్ బాస్ సీజన్ 6″లోకి నేరుగా ప్రవేశం పొందుతారు. వార్తల ప్రకారం “బిగ్ బాస్ తెలుగు సీజన్ 6” వచ్చే ఏడాది జూన్ లేదా జూలైలో ప్రారంభమవుతుంది. ఓటిటి వెర్షన్ కు ప్రేక్షకులు ఎక్కువ సేపు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే సిరీస్‌కు మరింత ఆదాయం, ఎక్కువ వినోదం, మంచి ప్రజాదరణ లభిస్తుంది. తేకాకుండా టెలివిజన్ వెర్షన్‌లోకి ఓటిటి పోటీదారుల ప్రవేశం అనేది మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఓటిటి వెర్షన్ డిస్నీ+హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది.
ఇదే ఫార్ములా హిందీలో విజయవంతం కావడంతో తెలుగు మేకర్స్ కూడా దానిని ఫాలో కాబోతున్నారు. బిగ్ బాస్ హిందీ ఓటిటి వెర్షన్ ఆగస్టులో ప్రారంభమై నిన్న రాత్రి పూర్తయ్యింది. దివ్య అగర్వాల్ ఓటిటి వెర్షన్ విజేతగా నిలిచింది. ఆమెకు ప్రైజ్ మనీగా రూ. 25 లక్షలు అందించారు. కరణ్ జోహార్ ఈ ఓటిటి వెర్షన్‌ను హోస్ట్ చేసారు. టెలివిజన్ వెర్షన్‌కు మాత్రం సల్మాన్ హోస్ట్‌గా ఉంటారు. మరి తెలుగులో నాగార్జున ఓటిటి వెర్షన్‌ని హోస్ట్ చేస్తాడా? లేదా మేకర్స్ మరో ప్రముఖుడిని హోస్ట్ గా పరిచయం చేస్తారా అనేది చూడాలి.
తాజావార్తలు
-
TVS Jupiter Dual Tone Spectral లాంచ్.. రూ.89,825కే.. అదిరిపోయే మైలేజ్, ఫీచర్లు..!
-
MOTN Survey 2026: మళ్లీ బీజేపీదే అధికారం.. ఇప్పుడే ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 326 సీట్లు..
-
Nepal Floods: వేళ్లన్నీ డ్రాగన్ వైపే.. విలయానికి చైనా నిర్మాణాలే కారణమా?
-
Government Action : వనపర్తిలో బుల్డోజర్ యాక్షన్.. రూ.52 కోట్ల బకాయిలపై ఉక్కుపాదం
-
Nepal Floods: నేపాల్‌కు మరో ముప్పు.. 72 గంటల్లో మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్!
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!