Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Bigg Boss Telugu Season 5 Bigg Boss Telugu Season 5 Sep 17th Episode

కొత్త కెప్టెన్ గా విశ్వ… సిరిని మరిపిస్తాడా!?

Published Date :September 17, 2021 , 6:52 am
By Prakash
కొత్త కెప్టెన్ గా విశ్వ… సిరిని మరిపిస్తాడా!?
  • Follow Us :
  • google news
  • dailyhunt

బిగ్ బాస్ సీజన్ 5 ఫస్ట్ కెప్టెన్ సిరి కాలపరిమితి 11వ రోజుతో పూర్తయ్యింది. ఆమె తర్వాత కెప్టెన్ గా విశ్వ ఎంపిక కావడం విశేషం. ‘పంతం నీదా నాదా’ గేమ్ థర్డ్ ఫేజ్ లో ‘అగ్గిపుల్లా మజాకా’ అనే ఆటను బిగ్ బాస్ ఈగల్, ఊల్ఫ్ టీమ్స్ తో ఆడించాడు. అందులో ఈగల్ టీమ్ విజయం సాధించింది. గత మూడు రోజులుగా జరిగిన పోటీల ద్వారా ఈగల్ టీమ్ కు 6, ఊల్ఫ్ టీమ్ కు 5 ఫ్లాగ్స్ దక్కాయి. దాంతో కెప్టెన్ అయ్యే ఛాన్స్ ను బిగ్ బాస్ ఈగల్ టీమ్ సభ్యులకు ఇచ్చాడు. దానికి ముందు రోజు రాత్రి శ్వేత వర్మ పుట్టిన రోజు సందర్భంగా ఆర్జే కాజల్ చేసిన కేక్ ను కట్ చేసింది. ఆమె తండ్రి పంపిన బర్త్ డే విషెస్ వీడియోను బిగ్ బాస్ హౌస్ లోని టీవీ మానిటర్ లో ప్లే చేశారు. ఇక ఈగల్ టీమ్ కెప్టెన్ అయిన శ్రీరామచంద్ర… తన టీమ్ సభ్యులను సంప్రదించి, అందులోంచి యానీ, విశ్వ, హమీదా, ప్రియాంక లను కెప్టెన్ టాస్క్ కు ఎంపిక చేశాడు. బిగ్ బాస్ హౌస్ లోని గార్డెన్ ఏరియాలో కొన్ని కొబ్బరి కాయలు పెట్టి, ‘కొడితే కొట్టాలిరా కొబ్బరికాయ కొట్టాలి’ అనే ఆట ఆడించాడు బిగ్ బాస్. ఈ నలుగురూ ఇతర హౌస్ మేట్స్ సాయంతో తమ ముందున్న బీకర్ ను కొబ్బరి నీళ్ళతో నింపాల్సి ఉంటుంది. ఈ గేమ్ లో విశ్వ విజేతగా నిలవడంతో అతన్నే రెండోవారం కెప్టెన్ గా బిగ్ బాస్ ఎంపిక చేశాడు. నిజానికి ఇందులో విశ్వ చేసిన పనికంటే… అతను ఎంచుకున్న టీమ్ చేసిన పని వల్లే కెప్టెన్ అయ్యాడు. ముందు మూడు రోజులు గేమ్ లో భాగంగా తీవ్రంగా గొడవలు పడిన బిగ్ బాస్ హౌస్ మేట్స్… 11 రోజు మాత్రం ఒకరి మీద ఒకరు ప్రేమ కురిపించేశారు. మానస్, లహరి మధ్య; లోబో, ఉమ మధ్య సరికొత్త ప్రేమ ఈ 11వ రోజున చిగురించింది. అలానే షణ్ముఖ్… హమీదాతో కాస్తంత అభిమానంగా మాట్లాడుతూ ఉండేసరికీ… రవి, లహరి తదితరులు అతని గర్ల్ ఫ్రెండ్‌ దీప్తి సునయనను ఉద్దేశించి ‘దీప్తి… షణ్ముఖ్ మీద ఓ కన్నేసి ఉంచూ’ అంటూ సరదాగా హెచ్చరించారు.

ఉమకు బెడ్ దానం చేసిన లోబో!
బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయిన రోజున బెడ్ లేక ఇబ్బంది పడిన లోబో అండ్ ఉమకు ఈ వారం సింగిల్ కాట్ బెడ్ ను కేటాయించాలని బిగ్ బాస్ భావించాడు. అయితే… ఇద్దరూ చెరొక స్కిట్ చేసి.. ఎవరు విజేతగా నిలిస్తే వారికే సింగిల్ కాట్ బెడ్ దొరుకుతుందని చెప్పాడు. లోబో… ప్రియాంకతో కలిసి ఆటో డ్రైవర్, కస్టమర్ స్కిట్ చేయగా; ఉమ, సిరితో కలిసి అత్త కోడళ్ళు భ్రమ, వాస్తవం అనే అంశంపై స్కిట్ చేసింది. ఇందులో లోబోను హౌస్ మేట్స్ విజేతగా ప్రకటించారు. దాంతో అతను సింగిల్ బెడ్ ను సొంతం చేసుకున్నాడు. అయితే.. ముందు నుండి చెబుతున్నట్టుగా లోబో దాన్ని ఉమాదేవికి ఇచ్చేశాడు. పదకొండవ రోజంతా… ఉమ, లోబో ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం… చూస్తుంటే కాస్తంత ఎబ్బెట్టుగానే ఉంది.

ఇదిలా ఉంటే… సెప్టెంబర్ 16 బర్త్ డే సందర్భంగా షణ్ముఖ్… బిగ్ బాస్ హౌస్ మేట్స్ సమక్షంలో కేక్ కట్ చేశాడు. అతని తల్లిదండ్రులతో పాటు ప్రియురాలు దీప్తి సునయన సైతం షణ్ముఖ్ కు బర్త్ డే విషెస్ తెలిపింది. అంతే కాదు…. బిగ్ బాస్ హౌస్ ఎదురుగా ఉన్న బిల్డింగ్ పైకిఎక్కి, అక్కడ కేక్ కట్ చేసి, గట్టిగా అరుస్తూ బిగ్ బాస్ హౌస్ లోని వారికి వినిపించేలా… బర్త్ డే విషెస్ తెలిపి, బాణ సంచా కాల్చారు. సో… గురువారం బిగ్ బాస్ రియాలిటీ షో వీక్షకులు అటు శ్వేత వర్మ, ఇటు షణ్ముఖ్ బర్త్ డే సెలబ్రేషన్స్ ను బాగానే ఎంజాయ్ చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bigg Boss 5
  • Bigg Boss 5 Sep 17th Episode
  • Bigg Boss Telugu 5
  • Bigg Boss Telugu Season 5
  • Vishwa

తాజావార్తలు

  • PAN Rules: పరిమితి పెంచారు.. రూ.20 లక్షలు దాటితేనే పాన్ అవసరం.. ఏప్రిల్ 1 నుంచే అమలు..

  • Rythu Bharosa Funds Released : రైతులకు గుడ్‌న్యూస్‌.. రైతు భరోసా నిధులు విడుదల

  • Pakistan: ప్రేక్షకులే లేకుండానే PSL మ్యాచ్‌లు.. పాకిస్తాన్ భయానికి కారణం ఇదే..

  • First Railway Bridge : 130 ఏళ్ల చరిత్ర గల రైల్వే బ్రిడ్జి కూల్చివేత

  • Vaibhav Suryavanshi: రెండు నుంచి మూడు వేల పరుగులు.. ప్లాన్ చెప్పిన వైభవ్.. పగలబడి నవ్విన తోటి ఆటగాళ్లు

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions