“బిగ్ బాస్ తెలుగు సీజన్ 5” కంటెస్టెంట్ వీజే సన్నీ హౌస్‌లోకి అడుగు పెట్టినప్పుడు చాలామంది ప్రేక్షకులకు కొత్త. అసలు “బిగ్ బాస్ తెలుగు 5” విజేతగా వీజే సన్నీ నిలుస్తాడని ఎవరూ ఊహించలేదు. హౌజ్ లో ఉన్నంత కాలం ఏదో ఒక వివాదంతో ముఖ్యంగా కోపం కారణంగా వార్తల్లో నిలిచిన సన్నీ ఈ 100 రోజుల్లో బుల్లితెర వీక్షకుల మనసు గెలుచుకుని విన్నర్ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. ఇక విజేతకు స్పోర్ట్స్ బైక్‌తో పాటు రూ. 50 లక్షల నగదు బహుమతిగా అందించారు నాగార్జున. అంతేకాదు షో నిర్వాహకులు షాద్‌నగర్‌లోని సువర్ణభూమి డెవలపర్స్ నుండి సన్నీకి ఒక ప్లాట్‌ని రివార్డ్ గా ఇచ్చారు. అలాగే వీజే సన్నీ హౌజ్ లో ఉన్నంత కాలం వారానికి 2 లక్షలు సంపాదించినట్లు సమాచారం. అంటే సన్నీకి 15 వారాల పాటు షో నుండి వచ్చిన మొత్తం ఆదాయం రూ. 25 లక్షల వరకు ఉంటుంది. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే సన్నీ కేవలం మూడు నెలల్లోనే షో నుండి రూ. 1 కోట్లు సంపాదించాడు. అయితే ఆయన ఇంటికి పట్టుకెళ్ళేది మాత్రం అంత కాదని తెలుస్తోంది.
రూ.50 లక్షల ప్రైజ్ మనీలో రూ.15.60 లక్షలు ఆదాయపు పన్ను శాఖకు చెల్లించాలి. దీంతో సన్నీ ప్రైజ్ మనీలో రూ.34.40 లక్షలు మాత్రమే ఉంటాయి. మిగిలిన డబ్బులో కూడా కొంతమొత్తాన్ని టాక్స్ రూపంలో చెల్లించక తప్పదు. ఇక ఏదైనా షోలో రూ.10 వేల కంటే ఎక్కువ మొత్తం గెలిస్తే 31.2% పన్ను చెల్లించాలి. ఇదంతా చూసుకుంటే సన్నీ కోటి గెలిచినా ఆయన ఇంటికి తీసుకెళ్లగలిగేది మాత్రం అందులో కొంతే !!
ఇక సన్నీ ఖమ్మం నుండి వచ్చాడు. అక్కడే తన పాఠశాల విద్యను కూడా పూర్తి చేశాడు. హైదరాబాద్‌లోని ఉస్మానియా కళాశాలలో బి.కామ్ డిగ్రీని పొందాడు. సన్నీ తల్లి ఎప్పుడూ నటి కావాలని అనుకునేదట. తన కోరిక తీరకపోవడంతో సన్నీని షోబిజ్ ప్రపంచంలోకి ప్రవేశించమని ప్రోత్సహించింది. ముందుగా ఓ టీవీ షోకి హోస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు సన్నీ. తరువాత ఒక న్యూస్ ఛానెల్‌లో లైఫ్‌స్టైల్ రిపోర్టర్‌గా మారాడు. ఆ తర్వాత సన్నీ అనే అరుణ్ రెడ్డి వీజే అయ్యారు. అనంతరం “కళ్యాణ వైభోగం” సినిమాతో వెండితెరపైకి అడుగుపెట్టాడు. ఇప్పుడు “బిగ్ బాస్ 5” విన్నర్ గా నిలిచాడు.