NTV Telugu Site icon

‘బిగ్ బాస్’ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్… కొత్త సీజన్ లోడింగ్

Bigg-Boss

Bigg-Boss

తెలుగులో పాపులర్ రియాలిటీ షోలలో “బిగ్ బాస్” ఒకటి. మొదటి సీజన్‌కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించగా, రెండో సీజన్‌కు నాని హోస్ట్‌గా వ్యవహరించారు. మూడవ సీజన్ నుండి షో హోస్ట్ చేసే బాధ్యతను నాగార్జున అక్కినేని తీసుకున్నాడు. తాజాగా హోస్ట్ గా నాగార్జున ఐదవ సీజన్‌ను విజయవంతంగా పూర్తి చేశాడు. ఆసక్తికరంగా బిగ్ బాస్ తదుపరి సీజన్ గురించి నాగ్ ఆసక్తికరమైన ప్రకటన చేశాడు. ‘బిగ్ బాస్ 5’ గ్రాండ్ ఫినాలే నిన్న గ్రాండ్ గా జరగగా… విన్నర్ ను ప్రకటించిన అనంతరం తాజాగా సీజన్ కు సైన్ ఆఫ్ చేయడానికి ముందు, నాగార్జున షో ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చాడు. ‘బిగ్ బాస్’ కొత్త సీజన్ మరో రెండు నెలల్లో ప్రేక్షకులను అలరించనుందని వెల్లడించారు.

“సాధారణంగా, కొత్త సీజన్ ప్రారంభం కావడానికి 8 నెలల సమయం పడుతుంది. కానీ ఈసారి ప్రేక్షకులు మరో రెండు నెలల్లో కొత్త సీజన్‌ను చూడబోతున్నారు” అంటూ నాగార్జున “బిగ్ బాస్ 6” గురించి ఈ వేదికపై నుంచే ప్రకటించారు. అయితే ఇది ‘బిగ్ బాస్ సీజన్ 6’ లేదా ‘బిగ్ బాస్’ ఫ్రాంచైజీలో ఏదైనా కొత్త అధ్యాయమా అనేది నాగార్జున క్లారిటీ ఇవ్వలేదు. బాలీవుడ్‌లో మాదిరిగానే బిగ్‌బాస్‌కు ఓటీటీ వెర్షన్ ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయంపైనే బుల్లితెరపై ఈ షోను వీక్షిస్తున్న ప్రేక్షకులకు కన్ఫ్యూజన్ ఏర్పడింది. కాగాకొత్త సీజన్ లో కంటెస్టెంట్స్ ఎవరన్న విషయంపై ఇప్పుడే చర్చ మొదలైపోయింది. సీజన్ 5లో సన్నీ టైటిల్ గెలుచుకోగా, షణ్ముఖ్ రన్నర్ గా నిలిచాడు.