NTV Telugu Site icon

బిగ్ బాస్-5 : డేంజర్ జోన్ లో ఆ పాపులర్ కంటెస్టెంట్ !

Bigg-Boss

Bigg-Boss

బుల్లితెర పాపులర్ షో “బిగ్ బాస్-5” తెలుగు ఆసక్తికరంగా మారుతోంది. గత వారం హౌజ్ లో నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ విశ్వా ఎలిమినేట్ అవ్వడం అందరికీ షాకిచ్చింది. అలాగే ఈరోజు జశ్వంత్ పడాల హౌజ్ నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుందని బిగ్ బాస్ వెల్లడించారు. గత వారంఎం పది రోజుల నుంచి జశ్వంత్ అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. ఇప్పటికి ఆయన ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో జశ్వంత్ ను ఇంటి నుంచి బయటకు పంపేస్తున్నాడు బిగ్ బాస్. తాజాగా దీనికి సంబంధించి ప్రోమోను సైతం విడుదల చేశారు.

Read Also : “అర్జున ఫల్గుణ” యాక్షన్ ప్యాక్డ్ టీజర్

ఇక “బిగ్ బాస్” అంటేనే ఏదైనా జరిగే షో. ఈ వారం మానస్, రవి, కాజల్, సిరి, షణ్ముఖ్ ఐదుగురు నామినేట్ అయ్యారు. అయితే ఇందులో ప్రముఖ యాంకర్ రవి ఎలిమినేషన్ ప్రమాదంలో ఉన్నారని తెలుస్తోంది. అతను కాజల్‌తో పాటు ఓట్లలో వెనుకబడి ఉన్నాడు. రవికి బయట యాంకర్ గా మంచి పాపులారిటీ ఉంది. అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. మరి అతన్ని ఎలిమినేషన్ నుండి కాపాడటానికి ఆయన బృందం బయట ఏమి చేస్తారో వేచి చూడాలి.