ట్రాన్స్ జండర్ అయిన ప్రియాంక సింగ్ కు తన పరిధులు తెలుసు. అయినా ఎమోషనల్ గా మానస్ తో బాండింగ్ పెంచుకుంది. ఈ విషయాన్ని గమనించి మానస్ పలు మార్లు హెచ్చరించే ప్రయత్నం చేసినా , ఆమె వినేది కాదు. పైగా అందరితో తమ మధ్య ఉన్నది స్నేహం అని చెబుతూ వచ్చింది. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చే ముందు వేదికపై నాగార్జునకూ అదే చెప్పింది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఒక్కొక్కరి గురించి పింకీ మాట్లాడింది. హౌస్ లోకి వచ్చినప్పుడు వారి మీద తనకున్న అభిప్రాయం ఏమిటీ? బయటకు వచ్చే ముందు ఓపీనియన్ ఏమిటీ? అనేది చెప్పింది.
Read Also : ర్యాపిడోకి కోర్టులో ఎదురుదెబ్బ
సిరి తనకంటే అందంగా ఉందని తాను భావించే దాన్నని, ఒకసారి మాటల్లో ఆమెది వైజాగ్ అని తెలిశాక ఠక్కున కనెక్ట్ అయ్యానని, సిరి టాస్క్ లు బాగా ఆడుతుందని, ఆమెను చూస్తే తన చెల్లి గుర్తొస్తుందని పింకీ తెలిపింది. శ్రీరామ్ పాటలను ఇష్టపడతానని, ఒకానొక సమయంలో అతన్ని శ్రీకృష్ణుడు చేయాలని ప్రయత్నించినా, శ్రీరాముడిగానే ఉండిపోయాడని చెప్పింది. షణ్ణు ను ‘ముదిరిపోయిన బెండకాయ్’ అని వ్యాఖ్యానించిన పింకీ, తాను బయటకు వస్తుంటే షణ్ణూ కూడా కన్నీళ్ళు పెట్టుకున్నాడని, అది తనకు నచ్చిందంది.
సన్నీలో మొదటి నుండి తానో అన్నయ్యను చూసుకున్నానని తెలిపింది. కాజల్ ఫస్ట్ నుండీ విపరీతంగా అల్లరి చేస్తుండేదని, ఇప్పటికీ ఆ అల్లరిని కొనసాగిస్తోందని చెప్పింది. చివరగా మానస్ గురించి మాట్లాడుతూ, మొదట్లో అతనికి చాలా పొగరు అనే భావన తనకు కలిగిందని, రోజులు గడిచే కొద్ది తమ మధ్య స్నేహబంధం ఏర్పడిందని, అతని నుండి ఎంతో నేర్చుకున్నానని, మానస్ ను విన్నర్ గా చూడాలనుకుంటున్నానని మనసులో మాట చెప్పేసింది. ఇక పింకీ కోరిక మేరకు మానస్ ‘ఉప్పెనంత ఈ ప్రేమకు…’ అనే పాట పాడాడు. అలానే బేసికల్ గా సింగర్ అయిన శ్రీరామ్ నూ తన కోసం ఓ పాట పాడమని పింకీ కోరింది. దాంతో అతను ‘ప్రియా ప్రియా చంపొద్దే…’ గీతాన్ని అలపించాడు. మొత్తం మీద బిగ్ బాస్ విజేతగా నిలువకపోయినా, ప్రియాంక సింగ్ హౌస్ లోని దాదాపు అందరి మనసుల్నీ గెలుచుకునే బయటకు వెళ్ళింది.
