బిగ్ బాస్ సీజన్ 5లోని కంటెస్టెంట్స్ చేతిలో ప్రతి వారం రెండు ఆయుధాలు ఉంటాయి. ఒకటి నామినేషన్ కాగా రెండోది వరస్ట్ పెర్ఫార్మర్ ను ఎంపిక చేసి జైలుకు పంపడం. అలా ఈసారి శ్వేతను హౌస్ లోని 13 మందిలో (శ్వేతను మినహాయిస్తే) నలుగురు వరస్ట్ పెర్ఫార్మర్ గా పేర్కొన్నారు. దానికి కారణం కూడా చాలా సింపుల్. బిగ్ బాస్ హౌస్ ప్రాపర్టీని రవి సలహా మేరకు శ్వేత, లోబో డామేజ్ చేయడమే. బొమ్మల తయారీలో భాగంగా దూది కోసం హౌస్ లోని పిల్లోస్ ను వీరు చించేడంతో భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. కెప్టెన్సీ టాస్క్ నుండి వీరిని బిగ్ బాస్ తప్పించగా, ఇప్పుడు వరస్ట్ పెర్ఫారెన్స్ లోనూ అదే రీజన్ తో లోబోను ముగ్గురు, రవిని ఇద్దరు వేలెత్తి చూపించారు.
సంచాలికగా సరిగా చేయలేదంటూ సిరిని ఇద్దరూ, యాని మాస్టర్ అనవసరం నోరు పెద్దది చేసి మాట్లాడిందని ఇద్దరు వరస్ట్ పెర్ఫార్మర్ గా పేర్కొన్నారు. మొత్తం మీద ఎక్కువ మంది ఓటు వేసిన కారణంగా శ్వేత జైలుకు వెళ్ళాల్సి వచ్చింది. అయితే… జైలు లో ఉన్న శ్వేత దగ్గరకు ఒక్కొక్కరుగా వెళ్ళి వారి రీజన్స్ చెప్పడం మొదలెట్టారు. శ్వేతపై వరస్ట్ పెర్ఫార్మర్ ముద్ర వేసిన షణ్ముఖ్… రవి చెబితే నువ్వు ఫాలో అవడం తప్పు అని, తెలివితేటలుఉన్న నువ్వు కూడా అతని ట్రాప్ లో పడిపోయావని శ్వేతకు చెప్పడం విశేషం. అలానే జెస్సీ కూడా హౌస్ లో జన్యూన్ పర్శన్ ఎవరూ అనేది గుర్తించమంటూ శ్వేతకు చెప్పాడు. రవి మీద కోపం తనకు తగ్గడం లేదని హౌస్ మేట్స్ దగ్గర వాపోయిన కాజల్ అతన్నే వరస్ట్ పెర్ఫార్మర్ గా పేర్కొంది. రవి చేసిన బ్లండర్ వల్లే సంచాలకులుగా తాము ఫెయిల్ అయినట్టు బిగ్ బాస్ చెప్పాడని, అతని వల్ల కెప్టెన్సీ టాస్క్ నుండి తాము ఎలిమినేట్ అయ్యామని ఆమె ఆరోపించింది.
Read Also : రస్టిక్ లుక్ లో నాని… ఆసక్తిని రేకెత్తిస్తున్న ‘దసరా’
పగలకొట్టిన వారిదే పండగ!
ఇక 40వ రోజు బిగ్ బాస్ ఇంటి సభ్యులకు లగ్జరీ బడ్జెట్ కు సంబంధించిన కొన్ని టాస్క్ లు ఇచ్చాడు. అయితే… రెండు రోజులుగా బొమ్మలు కుట్టీ కుట్టీ అలసిపోయిన ఇంటి సభ్యులకు మరీ టఫ్ గేమ్స్ ఇవ్వకుండా, లైటర్ వీన్ లోనే ఆడించాడు. వాటికి ఆసక్తికరమైన పేర్లూ పెట్టాడు. ‘పగల కొట్టిన వారిదే పండగ’, ‘యాపిల్ టవర్’, ‘చాప్ స్టిక్స్ బాల్’ ఇలాంటి సింపుల్ గేమ్స్ ఆడించాడు. ఆ ఆటల్లో కాజల్ గెలిచి ఉప్మారవ్వను, శ్వేత బట్టర్ ను గెలుచుకున్నారు. లోబో తన గేమ్ లో యానీ మీద విజయం సాధించి పన్నీర్ సొంతం చేసుకున్నాడు. రవి ఫ్రెంచ్ ఫ్రైస్ గెలుచుకున్నాడు. కూతురు లాంటి తన బెడ్ మేట్ శ్వేత జైలుకు వెళ్ళడంతో యాని మాస్టర్ లోన్లీగా ఫీలై… హాల్ లోని సోఫాలోనే పడుకోవడం విశేషం. అక్కడ శ్వేత కూడా జైలులో చాలా అనీజీగానే గడిపింది. మొత్తం మీద 40వ రోజు భారీ దూషణలూ భూషణలూ లేకుండా సాదాసీదాగా సాగిపోయింది.