Site icon NTV Telugu

బిగ్ బాస్ 5 : రవి పారితోషికం ఎంత అందుకున్నాడంటే ?

Ravi

Ravi

“బిగ్ బాస్ 5” చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే షోలో ట్విస్టులు, కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. నవంబర్ 28న జరిగిన ఎలిమినేషన్ రౌండ్ లో తన అభిమానులను షాక్‌ కు గురి చేస్తూ ప్రముఖ యాంకర్ రవి నిన్న రాత్రి బిగ్ బాస్ హౌస్ నుండి నిష్క్రమించాడు. దీంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ను ఎలా ఎలిమినేట్ చేస్తారంటూ ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా షో నిర్వాహకులపై మండిపడుతున్నారు. రవి ఓటింగ్ శాతాన్ని అధికారికంగా రివీల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు అన్నపూర్ణ స్టూడియో వద్ద ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి.

Read Also : “పుష్ప” ట్రైలర్ అప్డేట్… వైల్డెస్ట్ మాస్ ఫెస్టివల్ ఎప్పుడంటే ?

ఈ నేపథ్యంలో బిగ్ బాస్ నిర్వాహకులు రవికి భారీ రెమ్యునరేషన్ ఇవ్వాల్సి వస్తుందనే కారణంగానే ఎలిమినేట్ చేశారని ఆరోపించడంతో పాటు పలు ఊహాగానాలు చేస్తున్నారు. ఈ సీజన్ లో హౌస్‌లో అత్యధిక పారితోషికం పొందిన కంటెస్టెంట్స్ లో రవి ఒకరు. బిగ్ బాస్ మేకర్స్ ఒక్క వారానికి రవికి రూ.7 నుంచి 8 లక్షలు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. 12 వారాల్లో ఆయన మొత్తం రెమ్యునరేషన్ దాదాపు రూ.1 కోటికి చేరుకోవడంతో, టైటిల్ గెలవగల మంచి పోటీదారులలో రవి ఒకడు అయినప్పటికీ ఆయనకు ఎగ్జిట్ డోర్ చూపించారని ఆయన అభిమానులు మండిపడుతున్నారు.

Exit mobile version