బుల్లితెర రియాలిటీ షో “బిగ్ బాస్ 5” 50 రోజుల తరువాత ఊపందుకుంది. సన్నీ కోపం, మానస్ ఓదార్పు, యాని మాస్టర్ ఫైర్, మానస్, ప్రియా ట్రాక్ ఇలా హౌజ్ లో నవరసాలూ ఒలికిస్తున్నారు హౌస్ మేట్స్. రవి, లోబో, షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, మానస్ ఈ వారం నామినేషన్లలో ఉన్నారు. ఇక వీకెండ్ రావడంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అని ఆసక్తిగా ఎదురు చూస్తన్నారు. కానీ వారి ఆసక్తిని నీరు గార్చేస్తూ ఎప్పటిలాగే ఈ వారం కూడా ఇంటి నుంచి బయటకు వెళ్ళేది ఎవరన్నా విషయం ముందుగానే బయటకు వచ్చేసింది.
Read Also : నాగార్జున చెప్పిన పంచతంత్రం!
తాజా సమాచారం ప్రకారం ఈ వారం బిగ్ బాస్ 5 తెలుగు షో నుండి లోబో ఎలిమినేట్ అవుతాడు. లోబో ఈ వారం లోబోతో పాటు కొందరు మంచి పాపులారిటీ ఉన్నవారు కూడా నామినేట్ అయ్యారు. అయితే ఈ వారం నామినేషన్లలో ఉన్న వారిలో లోబోకు అతి తక్కువ ఓట్లు వచ్చాయని, ఆయన 8వ వారం ఇంటి నుండి బయటకు వెళ్లబోతున్నాడని తెలుస్తోంది. లోబో దాదాపు వారం రోజులు సీక్రెట్ రూమ్‌లో గడిపిన తర్వాత రీసెంట్‌గా హౌస్‌లో గ్రాండ్ గా రీఎంట్రీ అయ్యాడు. కానీ ఇప్పుడు లోబో మరింత డౌన్ అయినట్టుగా కన్పిస్తోంది.