NTV Telugu Site icon

బిగ్ బాస్ 5 : ఈ వారం ఎలిమినేషన్ లో ఈ కంటెస్టెంట్ అవుట్

Bigg-Boss

Bigg-Boss

“బిగ్ బాస్ తెలుగు సీజన్ 5” వీకెండ్ కు చేరుకుంది. ఈరోజు ఆదివారం కాబట్టి ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వక తప్పదు. షణ్ముఖ్, రవి, సన్నీ, మానస్, లోబో, ప్రియా, జెస్సీ, విశ్వ, హమీదా ఐదవ వారం ఎలిమినేషన్ కోసం నామినేట్ అయిన కంటెస్టెంట్స్. అయితే ఈ సీజన్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న విషయం అంత ఆసక్తికరంగా సాగడం లేదు. దానికి కారణం లీక్స్. సీజన్ మొదటి నుంచే కంటెస్టెంట్ల లిస్ట్ తో సహా ఏ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు ? అనే విషయం ముందుగానే లీక్ అవుతోంది. ఎప్పటిలాగే ఈ వారం కూడా ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయం ముందుగానే సోషల్ మీడియాలో లీక్ అయ్యింది.

Read also : హమీదా మీద శ్రీరామ్ ప్రేమ హంబక్కేనా!

సమాచారం ప్రకారం మోడల్‌, నటి హమీదా ఈ వారం షో నుండి బయటకు వచ్చే అవకాశం ఉంది. తొమ్మిది మంది నామినేటెడ్ కంటెస్టెంట్లలో ఆమెకే అతి తక్కువ ఓట్లు వచ్చాయట. హౌస్ లో శ్రీరామ చంద్రతో కొనసాగుతున్న ఆమె లవ్ ట్రాక్ కారణంగా ఈ వారం హమీదా సేఫ్ అని బిగ్ బాస్ వీక్షకులు భావించినప్పటికీ ఆమె ఈ వారం ఎలిమినేట్ అవుతుందని చెబుతున్నారు. ఈరోజు రాత్రికి ప్రసారమయ్యే ఎపిసోడ్ లో హమీదా హౌజ్ ఎలిమినేట్ కానుంది.