NTV Telugu Site icon

సీక్రెట్ రూమ్ లోకి లోబో!

Lobo

బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్స్ ను సీక్రెట్ రూమ్ లోకి పంపడం అనేది కాస్తంత ఆలస్యంగా జరిగింది. బిగ్ బాస్ ఇంటి సభ్యులు అత్యధికంగా ఓటు వేసిన నేపథ్యంలో లోబో ఎవిక్ట్ అయ్యాడని ప్రకటించిన నాగార్జున అతన్ని సీక్రెట్ రూమ్ లోకి పంపడం శనివారం నాటి కొసమెరుపు. ఈ వారం ఏకంగా 10మంది సభ్యులు నామినేషన్స్ లో ఉండగా, శనివారం నామినేషన్స్ కు సంబంధించి ఎవరు సేవ్ అయ్యారో చెప్పకుండా నాగార్జున కొత్త ఆట మొదలెట్టాడు.

ప్రాపర్టీ నాశనం చేసినందుకు నాగ్ క్లాస్!
శనివారం బిగ్ బాస్ వేదిక మీదకు రావడమే నాగార్జున హౌస్ మేట్స్ ను క్లాస్ పీకడం మొదలెట్టేశాడు. అయితే దానికి ముందు 41వ రోజు ఏం జరిగిందో కూడా చూపించే ప్రయత్నం చేశాడు. శ్వేతకు జైలు నుండి విముక్తి లభించగానే, ఒంటరిగా సెల్ లో ఉండటంతో 20 నుండి 30 శాతం వరకూ సెట్ అయ్యానని ఆమె తెలిపింది. జైలు నుండి వచ్చిన తర్వాత ఆమెను ఇన్ ఫ్లుయెన్స్ చేయడానికి ఎప్పటిలానే షణ్ణు, జెస్సీ ప్రయత్నించారు. ఇకపై రవి మాటను ఆలకించే విషయంలో జాగ్రత్తగా ఉంటానని అతనికే శ్వేత చెప్పడం విశేషం. అలానే రవిని నామినేట్ చేసిన కాజల్ కు అతనికి మధ్య కాస్తంత గ్యాప్ ఏర్పడింది. ముందు రోజున రవి మీద కోపం తగ్గలేదని చెప్పిన కాజల్… ఇవాళ అతను సారీ చెప్పే సరికీ ఓ ఫ్రెండ్లీ హగ్ ను ఇచ్చి, మెత్తబడినట్టుగా ప్రవర్తించింది. ఆ తర్వాత నాగార్జున హౌస్ లోని సభ్యులందరికీ సౌతిండియన్ షాపింగ్ మాల్ ష్యాషన్ షో ను కండక్ట్ చేశారు. రెడ్ కార్పెట్ పై ర్యాంప్ వాక్ నిర్వహించాడు. అదిరేటి డ్రస్సులతో బిగ్ బాస్ సభ్యులంతా ఉత్సాహంగా ర్యాంప్ వాక్ చేశారు. ఆ తర్వాత నాగ్ వారికి క్లాస్ పీకడం మొదలెట్టాడు. ఓ కిల్లర్ టెడ్డీని తెప్పించి, దానిని పట్టుకోమని ఒక్కొక్కరికీ చెప్పి, వారు చేసిన తప్పులను వివరించి చెప్పాడు. ఒక్క సన్నీ, షణ్ణు మాత్రం నాగ్ తో క్లాస్ తీయించుకోలేదు. లోబో ప్రతి దానికీ దబాయించడాన్ని నాగ్ తప్పు పట్టాడు. రవి చెప్పినట్టు వినడం కాకుండా కాస్తంత బుర్ర పెట్టి ఆలోచించమన్నాడు. హౌస్ ను 24 గంటలూ, 70 కెమెరాలు పర్యవేక్షిస్తుంటాయని, ఎవరూ దాని నుండి దాటి పోలేరని, ఎవరు ఎలా నటించినా కెమెరాకు దొరికి పోవడం ఖాయమని నాగ్ హెచ్చరించాడు. బిగ్ బాస్ హౌస్ ప్రాపర్టీస్ ను నాశనం చేస్తే శిక్ష తీవ్రంగా ఉంటుందని మరోసారి హెచ్చరించాడు.

లోబో, ప్రియా అనర్హులన్న బిగ్ బాస్ సభ్యులు!
బిగ్ బాస్ హౌస్ లో ఆరు వారాల జర్నీ పూర్తయిన సందర్భంగా ప్రతి సభ్యుడినీ నాగార్జున కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి, వారి దృష్టిలో ఈ హౌస్ లో ఎవరు ఉండటానికి అనర్హులో చెప్పమని నాగార్జున కోరాడు. దాంతో ప్రియా అనర్హురాలని సన్నీ, కాజల్, విశ్వ, లోబో చెప్పారు. అలానే లోబో అనర్హుడని షణ్ముఖ్, సిరి, శ్వేత, యాని భావించారు. ఇక కాజల్ పేరును ప్రియాంక, ప్రియా చెప్పగా శ్రీరామ్ పేరును మానస్; రవి పేరును శ్రీరామ్, జెస్సీ చెప్పారు. లోబో – ప్రియకు నాలుగేసి ఓట్లు రావడంతో మరోసారి వీరిద్దరిలో ఎవరు ఎవరి పక్షాన నిలబడతారో తేల్చుకోమని నాగ్ చెప్పాడు. దాంతో తక్కువ మంది సపోర్ట్ చేసిన లోబోను హౌస్ నుండి నాగార్జున వేదిక మీదకు తీసుకొచ్చాడు. లోబో బయటకు వెళ్ళేప్పుడు అందరికంటే ఎక్కువ బాధపడింది విశ్వనే! ఇక నాగార్జున దగ్గరకు వెళ్ళిన లోబోను… అక్కడ హౌస్ మేట్స్ లో ఎవరికి థంబ్స్ అప్, ఎవరికి థంబ్స్ డౌన్ చూపిస్తావని అడిగాడు. చిత్రంగా హౌస్ లో ఉన్న 13 మందికి లోబో థంబ్స్ అప్ చెప్పాడు. తనకి తాను థంబ్స్ డౌన్ చేసుకున్నాడు. అయితే… బిగ్ బాస్ హౌస్ లోంచి ఏ వ్యక్తినైనా ఎవిక్షన్ చేసే అధికారం హౌస్ సభ్యులకు గానీ తనకు కానీ లేదని చెప్పి, అతన్ని వారం పాటు సీక్రెట్ రూమ్ లో ఉంచుతున్నట్టు నాగ్ ప్రకటించాడు. అయితే ఈసారి ఎలిమినేషన్స్ లో శ్వేతపై వేటు పడినట్టుగా ఇప్పటికే సోషల్ మీడియాలో ఓ ప్రచారం కార్చిచ్చులా సాగుతోంది. అందులో ఎంత వాస్తవం ఉంది? ఏ కారణంగా శ్వేత ఎలిమినేట్ అయ్యింది అనేది తెలుసుకోవాలంటే… ఇంకొన్ని గంటలు వేచి ఉండాల్సిందే!