NTV Telugu Site icon

బిగ్ బాస్ 5 : ఈ వారం ఎలిమినేషన్ షాక్ ఎవరికంటే ?

Bigg-Boss5

Bigg-Boss5

“బిగ్ బాస్ 5” ఇంకా రెండు వారాలు మాత్రమే మిగిలింది. ఫైనల్స్ చేరుకున్న ఈ షో గురించి ఎప్పటికప్పుడు లీక్స్ వస్తూనే ఉన్నాయి. ఈవారం ఎలిమినేషన్ విషయంలో కూడా లీక్స్ తో పాటు అందరూ అనుకున్నదే జరిగింది. అంతా ఊహించినట్లుగానే “బిగ్ బాస్ తెలుగు సీజన్ 5” 13వ వారంలో ప్రియాంక సింగ్ అకా పింకీ ఎలిమినేట్ అయింది. ప్రియాంక సింగ్ “జబర్దస్త్” కామెడీ షోలో గుర్తింపు తెచ్చుకున్న ట్రాన్స్‌జెండర్. ‘బిగ్ బాస్’ హౌస్‌లో తన సత్తా చాటి ప్రియాంక సింగ్ పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది.

Read Also : సితారకు ఆ సన్నివేశాలు అస్సలు నచ్చవు : మహేష్ బాబు

బిగ్ బాస్ హౌస్‌లోని అందరితో పోలిస్తే ప్రియాంక సింగ్ బలహీనమైన కంటెస్టెంట్ అని చెప్పొచ్చు. కానీ మానస్‌తో ఆమె స్నేహం ఇంట్లో 13 వారాలు ఉండడానికి సహాయ పడింది. హౌజ్ లో ఆమె మంచి ప్రవర్తనతో అందరితో మంచిగా ఉంటుంది. టాస్క్‌లలో ఆమె పనితీరు అంతగా బాగాలేకపోయినా, ఆమె ఇతరులను ఎప్పుడూ నొప్పించలేదు. నిజానికి 10వ వారం తర్వాత ప్రియాంక ఎలిమినేట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా హౌజ్ లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ రవి, అనీ షో నుండి ఎలిమినేట్ అయ్యారు. కానీ ప్రియాంక ఇప్పటి వరకూ రాణించింది. ప్రియాంక ఎలిమినేషన్‌తో బిగ్ బాస్ హౌస్‌లో ప్రస్తుతం 6 మంది సభ్యులు ఉన్నారు.

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో శ్రీరామ్, మానస్, సన్నీ, కాజల్, సిరి, షణ్ముఖ్ ఉన్నారు. శ్రీరామ చంద్ర ఇప్పటికే ఫైనల్‌కు టిక్కెట్‌ను దక్కించుకున్నాడు. వచ్చే వారం చివరికల్లా గ్రాండ్ ఫినాలేలో మిగతా వారిపై క్లారిటీ వస్తుంది.