‘బిగ్ బాస్ తెలుగు 5’ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. వీక్షకులు తమ అభిమాన కంటెస్టెంట్స్ కు దూకుడుగా ఓటు వేస్తున్నారు. ప్రియాంక సింగ్, సిరి, షణ్ముఖ్, మానస్, కాజల్, సన్నీ, శ్రీరామ్ చంద్ర, అనీ మాస్టర్ 11వ వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్స్‌లో ఉన్నారనే విషయం తెలిసిందే. ఈ వారం షో నుండి అనీ మాస్టర్ ఎలిమినేట్ అయినట్లు తెలిసింది. అనీకి అందరి కంటే అతి తక్కువ సంఖ్యలో ఓట్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఆమె గత రెండు వారాల్లో అనవసరంగా అరవడం, అతిగా ఏడవడం, ఇతరులను వెక్కిరిస్తూ అనుకరించడం వంటి కారణాలతో ప్రేక్షకులకు చికాకు కలిగించింది.
Read Also : ఐదు భాషల్లో “పుష్ప” డిస్ట్రిబ్యూటర్స్ కన్ఫర్మ్
అనీ ఇతరులను ముఖ్యంగా కాజల్‌ను రెచ్చగొట్టే చర్యలతో అగౌరవపరచడంపై నెటిజన్లు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇంట్లో ఆమె చిన్నపిల్లల చేష్టలు, ప్రవర్తనతో, అనీ ఇతర హౌస్‌మేట్స్‌తో ఎక్కువ కాలం ఉండాల్సిన వ్యక్తి కాదని వీక్షకులు గ్రహించారు. ఇప్పుడు అనీ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన ఈ ఎపిసోడ్ ఆదివారం ప్రసారం కానుంది. ఇక రేసులో ఎనిమిది మంది హౌస్‌మేట్స్ మాత్రమే మిగిలి ఉన్నారు.