ఐదు భాషల్లో “పుష్ప” డిస్ట్రిబ్యూటర్స్ కన్ఫర్మ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ “పుష్ప” డిసెంబర్ 17న భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాతోనే అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నాడు. అయితే ముందుగా ఈ సినిమా విషయంలో ఇంతటి భారీ ప్లాన్స్ లేకపోవడంతో మైత్రీ మూవీ మేకర్స్ హిందీ డబ్బింగ్ రైట్స్‌ను గోల్డ్ మైన్స్ యూట్యూబ్ ఛానెల్‌కి విక్రయించింది. అనంతరం అల్లు అర్జున్, సుకుమార్ ఆలోచన మార్చుకుని ‘పుష్ప’ను పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేశారు. దీంతో ‘పుష్ప’ టీమ్ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించుకుంది. అక్కడ మైత్రి, గోల్డ్ మైన్స్ మధ్య వివాదం తలెత్తింది. ఈ సమస్యను నిర్మాతలు పరిష్కరించలేకపోయారు. దీంతో ‘పుష్ప’ హిందీ వెర్షన్ విడుదలపై అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఎట్టకేలకు అల్లు అర్జున్ ఎంట్రీతో సమస్య సామరస్య పూర్వకంగా పరిష్కారమైంది. ‘పుష్ప’ హిందీ పంపిణీ హక్కులను ఏఏ ఫిల్మ్స్ దక్కించుకుంది. గతంలో బాహుబలి, ‘కేజీఎఫ్’ వంటి భారీ సినిమాలను ఏఏ ఫిల్మ్స్ హిందీలో పంపిణీ చేసింది. ఏఏ ఫిల్మ్స్ రవీనా టాండన్ భర్త అయిన అనిల్ తడానీది. బాలీవుడ్‌లో పెద్ద డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్న ఆయన ‘పుష్ప’ కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాడు.

Read Also : తల అజిత్, షాలిని లేటెస్ట్ పిక్స్ వైరల్

ఇదిలా ఉండగా మిగతా భాషల్లోనూ ‘పుష్ప’ డిస్ట్రిబ్యూటర్లు ఖరారైనట్టు సమాచారం. ఈ4 ఎంటర్టైన్మెంట్ మలయాళంలో, లైకా ప్రొడక్షన్స్ తమిళంలో, స్వాగత్ ఎంటర్‌ప్రైజెస్ కన్నడలో, ఏఏ ఫిలిమ్స్ ఇండియాలో, ఓవర్శిస్ లో హంసిని ఎంటర్టైన్మెంట్ “పుష్ప”ను విడుదల చేయబోతున్నారు. “పుష్ప” మేకర్స్ ఈ సినిమా కోసం భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేసారు. సుకుమార్ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్ గా కనిపించబోతున్నారు.

Related Articles

Latest Articles