బిగ్ బాస్ టీవీ షో విజయవంతంగా 5 వారాలు పూర్తి చేసుకుంది. ఈ ఐదు వారాలలో కంటెస్టెంట్లు టాస్కులు, గొడవలు, ప్రేమలతో ప్రేక్షకులను బాగానే అలరించారు. ఇక ఐదు వారాల్లో జరిగిన ఎలిమినేషన్ రౌండ్లలో ఐదుగురు వీక్ కంటెస్టెంట్లు ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఈ వారం హమీద ఎలిమినేటి అయ్యింది. ఈరోజు సోమవారం అంటే నామినేషన్ ప్రక్రియ జరగనుంది. అయితే ఆరవ వారానికి గానూ నామినేషన్లలో ఏకంగా 10 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో 14 మంది ఇంటి సభ్యులు మాత్రమే ఉండగా అందులో పదిమంది ఆరవ వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్లలో ఉన్నారు.
Read Also : బిగ్ బాస్ హౌస్ లో దసరా సరదాలు!
ప్రియా హౌస్ కెప్టెన్ కాబట్టి ఆమె నామినేషన్లలో లేదు. యాని మాస్టర్, కాజల్, షణ్ముఖ్ కూడా ఈ వారం నామినేషన్లలో లేరు. విశ్వ, జెస్సీ, రవి, మానస్, ప్రియాంక, లోబో, సిరి, సన్నీ, శ్వేత, శ్రీరామ చంద్ర ఈవారం నామినేటెడ్ కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారు. అయితే పరిస్థితి చూస్తుంటే ఈవారం డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశం కన్పిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.