Site icon NTV Telugu

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ హౌసుకు క్యూ కట్టిన సెలబ్రిటీలు.. ఎవరెవరు వెళ్లారంటే?

Bigg Boss

Bigg Boss

బిగ్ బాస్ తెలుగు ఎప్పటిలాగే ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఈ సీజన్ ఇప్పటికే పలు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుని మరో వీకెండ్ కి వచ్చేసింది. ఈ వారం కూడా ఒక సెన్సేషనల్ ఎలిమినేషన్ ఉండబోతుందని తెలుస్తోంది. ఆ సంగతి పక్కన పెడితే ఈ వారం మాత్రం బిగ్ బాస్ హౌస్ కి పెద్ద ఎత్తున సినిమా టీమ్స్ క్యూ కట్టాయి. అసలు విషయం ఏమిటంటే మరికొద్ది రోజులలో దీపావళి సందర్భంగా పెద్ద ఎత్తున సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ సినిమాలకు సంబంధించిన టీమ్స్ ప్రమోషన్స్ కోసం బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాయి.

ANR Award: అక్టోబర్ 28న ANR అవార్డు వేడుక.. మెగాస్టార్ చిరంజీవికి అవార్డు అందజేయనున్న బిగ్ బి

ఇక దసరా ఎపిసోడ్ సంబంధించి టెలికాస్ట్ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. అనసూయ భరద్వాజ్ తో పాటు మెహరీన్ డాన్స్ పెర్ఫార్మెన్స్ లో కూడా స్పెషల్ అట్రాక్షన్ గా ఉండబోతున్నాయి. శివ కార్తికేయన్, సాయి పల్లవి గెస్ట్లుగా దీపావళి ఎపిసోడ్ షూట్ చేయబోతున్నారని తెలుస్తోంది. కిరణ్ అబ్బవరం తన కా సినిమా ప్రమోషన్స్ కోసం లోపలికి వెళ్లినట్లు తెలుస్తోంది. వీరు మాత్రమే కాకుండా దుల్కర్ సల్మాన్ హౌస్ లోపలికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. అక్కడ హౌస్ మేట్స్ తో ఒక టాస్క్ కూడా ఆడించాడని చెబుతున్నారు. మొత్తం మీద ఈ వారం మాత్రం బిగ్బాస్ హౌస్ నిండా సెలబ్రిటీలు సందడి చేయబోతున్నారని చెప్పాలి.

Exit mobile version