Aunty Sentiment on Bebakka : బిగ్బాస్ సీజన్ 8లో మొత్తంగా 14 మంది హౌస్లోకి అడుగుపెట్టగా వారిలో ఏడుగురు అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలు జంటలుగా కలిసి వెళ్లారు. ఇక ఫస్ట్ వీక్ నామినేషన్లో ముగ్గురు చీఫ్లు నిఖిల్, నైనిక, యష్మీ మినహా మిగిలిన 11 మంది నామినేషన్ ప్రక్రియలో పాల్గొనగా మొత్తంగా ఆరుగురు నామినేట్ అయ్యారు. విష్ణుప్రియ, సోనియా, పృథ్వీరాజ్, శేఖర్ బాషా, బేబక్క, నాగమణికంఠలను నామినేషన్ జోన్ లో ఉంచగా ఊహించిన దాని ప్రకారమే బెజవాడ బేబక్కను బయటకు పంపేశారు. అయితే ఈ విషయంలో హిస్టరీ రిపీట్ అయిందని చెప్పొచ్చు.
Box Office: రచ్చ రేపుతున్న శనివారం.. పాపం గోట్!
ఎందుకంటే మొదటి సీజన్ నుంచే ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ అయిన వారి లిస్టు చూస్తే అది కాకతాళీయమో లేక యాదృచ్ఛికమో తెలియదు కానీ ఒకే వయసు ఉన్నవారిని ఎలిమినేట్ చేస్తూ వస్తున్నారు. ఫస్ట్ సీజన్ నుంచి ఏడో సీజన్ వరకూ చూస్తే.. తొలివారంలో ఎలిమినేట్ అయిన వాళ్లు అందరూ బేబక్క ఏజ్ గ్రూప్ వాళ్లే మొదటి సీజన్ చూస్తే నటి జ్యోతి, రెండో సీజన్ సంజన అన్నే, మూడో సీజన్ నటి హేమ, నాలుగో సీజన్ సూర్య కిరణ్, ఐదో సీజన్ సరయూ,ఆరో సీజన్ షాని సాల్మన్, ఏడవ సీజన్ కిరణ్ రాథోడ్ వంటి వాళ్ళు అందరూ వీళ్లంతా ఇలా బయటకు వచ్చేసిన వాళ్లే. షాని సాల్మన్, సూర్య కిరణ్, సంజనలను పక్కన పెడితే మిగతా అందరూ కూడా దాదాపుగా ఒకటే ఏజ్ గ్రూప్ వాళ్ళు, ముఖ్యంగా సోషల్ మీడియా జనం అంతా ఆంటీ కేటగిరీలో ఉన్నవారే. ఈ క్రమంలో ఈ సీజన్ లో కూడా అదే రిపీట్ అయిందని చెప్పొచ్చు.