బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఈసారి సీజన్ విన్నర్ అతనే అంటూ సోషల్ మీడియాలో పెద్ద ప్రచారమే జరుగుతుంది.. ఇక ఇప్పుడు ఓ ఫోటో వైరల్ అవుతుంది.. అతను పెళ్లి చేసుకున్నట్లు ఆ ఫొటోలో కనిపిస్తుంది.. నిజంగానే పెళ్లి చేసుకున్నాడా.. ఆ ఫొటోలో అమ్మాయి అతని భార్యేనా అనే సందేహం జనాల్లో మొదలైంది..
రైతు బిడ్డ అంటూ సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాడు పల్లవి ప్రశాంత్.. మొదట్లో పల్లవి ప్రశాంత్ విమర్శలు ఎదుర్కొన్నాడు. సింపతీ గేమ్ ఆడుతున్నాడు. అమ్మాయిలతో పులిహోర కలుపుతున్నాడంటూ ట్రోల్స్ కి గురయ్యాడు.. ఆ తర్వాత అతడు టాస్క్ లలో చురుగ్గా ఉంటున్నాడు.. నాలుగో పవర్ అస్త్ర పల్లవి ప్రశాంత్ గెలుచుకున్నాడు. రెండు వారాల ఇమ్యూనిటీ గెలుచుకున్నాడు. అలాగే పోరాడి గెలిచి ఇంటి ఫస్ట్ కెప్టెన్ అయ్యాడు. ఇది నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి.. ప్రస్తుతం ఇతగాడు ప్రతి టాస్క్ ను చాకచక్యంగా పూర్తి చేస్తున్నాడు.. ఇప్పుడు అందరి టార్గెట్ అయ్యాడు ప్రశాంత్..
ఇదిలా ఉండగా.. పల్లవి ప్రశాంత్ కి పెళ్లైయిందంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ గా మారింది. దీంతో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. సదరు ఫోటోలో పల్లవి ప్రశాంత్ భార్యతో పాటు కనిపిస్తున్నాడు. పెళ్లి బట్టల్లో వధువు పక్కన మెరిసిపోతున్నారు.. ఇది నిజంగా జరిగిందా.. లేదా ఏదైనా మార్ఫింగ్ చేశారా.. లేక ఏదైనా ప్రమోషన్స్ కోసం యాడ్ చేశాడా అనేది తెలియాల్సి ఉంది.. ఆ మధ్య ప్రశాంత్ తండ్రి ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. మేము కోటీశ్వరులమని వస్తున్న వార్తల్లో నిజం లేదు. పల్లవి ప్రశాంత్ మంచివాడు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక పెళ్లి చేస్తాం అని అన్నారు.. మరి ఆ ఫోటో నిజం కాదని తెలుస్తుంది.. మరి నిజమేంటో అనేది ప్రశాంత్ చెప్పాలి.. ఇక ఈరోజు బిగ్ బాస్ నుంచి అశ్విని ఎలిమినేట్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈరోజు ఎపిసోడ్ లో సెలెబ్రేటీలు ఎంట్రీ ఇవ్వనున్నారు.. తప్పక ఈ రోజు ఎపిసోడ్ చూడాలి మరి..