Bigg Boss 10 Telugu Live: బిగ్‌బాస్ సీజన్ 10 లైవ్ అప్డేట్స్.. హౌస్‌లోకి కంటెస్టెంట్స్ ఎంట్రీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని నాగార్జున హోస్ట్‌గా బుల్లితెర అతిపెద్ద రియాలిటీ షో ‘బిగ్ బాస్’ పదో సీజన్ వైభవంగా ప్రారంభమైంది. ‘దశావతారం’ అనే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మైలురాయి సీజన్, ప్రేక్షకులకి సరికొత్త వినోదాన్ని పంచడానికి ‘స్టార్ మా’, ‘జియో హాట్ స్టార్’లలో ప్రసారమవుతోంది. గత తొమ్మిది సీజన్ల జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, 10వ సీజన్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన 10 పవర్స్, అధునాతన రోబోటిక్ పరిజ్ఞానంతో హౌస్ వాతావరణాన్ని సరికొత్తగా తీర్చిదిద్దారు.
Also Read
- Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్ నాయుడికి దెబ్బ మీద దెబ్బ.. వరుస ఓటములు..
- Bigg Boss 10 Contestants Remuneration: బిగ్‌బాస్ హౌస్‌లో రాంప్రసాద్‌కు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్.. మిగిలిన వారికి ఇలా..
- Bigg Boss: బిగ్‌బాస్ హౌస్‌లోకి మేరీ కోమ్.. ‘పంచ్’లలో జాగ్రత్త అంటూ సెటైర్..
- Bigg Boss 10: బిగ్ బాస్ సెట్ వర్క్ మొదలు.. ఆరోజు నుంచే షో.!
-
06 Sep 2026 09:40 PM (IST)
12వ కంటెస్టెంట్‌గా చరణ్ ఎంట్రీ
'అగ్నిపరీక్ష'లో ఆడియన్స్ ఓటింగ్‌లో అత్యధిక ఆదరణ పొందిన చరణ్ 'బిగ్ బాస్' హౌస్‌లోకి అడుగుపెట్టాడు. హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకులను తన నటన, కామెడీతో నిరంతరం నవ్విస్తూ అలరిస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చాడు.
-
06 Sep 2026 09:32 PM (IST)
11వ కంటెస్టెంట్‌గా జబర్దస్త్ ఫేమ్ నరేష్ ఎంట్రీ
జబర్దస్త్ ఫేమ్ నరేష్ 11వ కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టాడు. ఆన్లైన్లో తన పేరు వెతికితే 'బిగ్ బాస్ 10 విజేత నరేష్' అని కనిపించడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే ఆయన ఎంట్రీ మాత్రం కాస్త వినూత్నంగా సాగింది. నరేష్‌ను ఒక పెద్ద పెట్టెలో కూర్చోబెట్టి హౌస్‌లోకి పంపించారు. ఆ తర్వాత లోపల ఉన్న ఇంటి సభ్యులు ఆ పెట్టెపై ఉన్న ఒక పజిల్‌ను పూర్తి చేసి, తాళం తీసి అతడిని బయటకు తీసుకువచ్చారు.
-
06 Sep 2026 09:29 PM (IST)
10వ కంటెస్టెంట్‌గా శ్రష్టి వ్యాకరణం ఎంట్రీ
'అగ్నిపరీక్ష' ద్వారా ఎంపికైన శ్రష్టి వ్యాకరణం పదో కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌస్‌లో ప్రవేశించింది. యాంకర్ శ్రీముఖి ఆమెను ప్రోత్సహిస్తూ, హోస్ట్ నాగార్జునకు ప్రతివారం తన తరఫున ఫ్లయింగ్ కిస్ ఇవ్వాలని ప్రత్యేకంగా కోరింది.
-
06 Sep 2026 09:12 PM (IST)
తొమ్మిదో కంటెస్టెంట్‌గా టెంపర్ వంశీ ఎంట్రీ
'టెంపర్' చిత్రంలో నటనతో గుర్తింపు పొందిన వంశీకృష్ణ (టెంపర్ వంశీ) 'బిగ్ బాస్' హౌస్‌లోకి తొమ్మిదో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. తన నటన, వైవిధ్యమైన శైలితో ప్రేక్షకులను అలరించడానికి ఆయన సిద్ధమయ్యాడు.
-
06 Sep 2026 08:57 PM (IST)
ఎనిమిదో కంటెస్టెంట్‌గా షాలినీ ఎంట్రీ
బిగ్‌బాస్ అగ్నిపరీక్ష దాటి హౌస్‌లోకి అడుగుపెట్టింది షాలినీ పటేల్. కామనర్స్ నుంచి ఝాన్సీ, అమన్ అండ్ షాలినీ అడుగు పెట్టారు.
-
06 Sep 2026 08:48 PM (IST)
ఏడో కంటెస్టెంట్‌గా రాంప్రసాద్ ఎంట్రీ
జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆటో రాంప్రసాద్ తన ప్రత్యేకమైన టైమింగ్, వినోదంతో అలరించడానికి ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి ఏడో కంటెస్టెంట్‌గా ఎంతో ఉత్సాహంగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు.
-
06 Sep 2026 08:44 PM (IST)
ఆరో కంటెస్టెంట్‌గా చైత్ర రాయ్
సీరియల్ నటి చైత్ర రాయ్ తన పది నెలల పాపను విడిచిపెట్టి, మానసిక ధైర్యంతో 'బిగ్ బాస్' హౌస్‌లోకి ఆరో కంటెస్టెంట్‌గా ప్రవేశించింది.
-
06 Sep 2026 08:19 PM (IST)
ఐదో కంటెస్టెంట్‌గా అమన్ మసూద్
అగ్నిపరీక్ష ద్వారా వచ్చిన సామాన్యుల్లో రెండో వ్యక్తిగా బిగ్ బాస్ హౌస్‌లోకి అమన్ మసూద్ ఎంట్రీ ఇచ్చాడు. ఆడియన్స్ ఓట్ల ద్వారా అమన్‌ను ఎంపిక చేసినట్లు నాగార్జున తెలిపారు. మొత్తం మీద హౌస్‌లోకి ఐదో కంటెస్టెంగ్‌గా వైట్ గోల్డ్ మెడల్‌తో అమన్ ఎంట్రీ ఇచ్చాడు.
-
06 Sep 2026 08:14 PM (IST)
మొదటి టాస్క్‌లో దుమ్మురేపిన త్రిగుణ్, ఝాన్సీ..
వెళ్లిన నలుగురు కంటెస్టెంట్‌కు నాగార్జున లవ్ ట్రయాంగిల్ అనే టాస్క్ పెట్టాడు. దీనిలో మొదట త్రిగుణ్, తర్వాత సింగర్ ఝాన్సీ, మూడో ప్లేస్‌లో సుధీర్ రెడ్డి, నాల్గవ ప్లేస్‌లో దేబ్జానీ మోదక్ ఆ టాస్క్‌ను ఫినిష్ చేశారు. వీరిలో ఇద్దరికి మ్యాజిక్ కీలు అందించనున్నారు.
-
06 Sep 2026 08:06 PM (IST)
నాల్గవ కంటెస్టెంట్‌గా సుధీర్ రెడ్డి
సోషల్ మీడియాలో ఎంతో ప్రజాదరణ పొందిన డిజిటల్ కంటెంట్ క్రియేటర్ సుధీర్ రెడ్డి 'బిగ్ బాస్ 10'లోకి నాలుగో పోటీదారుగా ఘనంగా అడుగుపెట్టారు. వేదికపై ఆయనకు సంబంధించిన ప్రత్యేక పరిచయ వీడియోను ప్రదర్శించారు. ఈ సందర్భంగా హోస్ట్ నాగార్జునతో మాట్లాడిన సుధీర్, సినీ నటి అనుష్క శెట్టి తన అభిమాన నటి అని, ఆమెపై తనకు ఎంతో క్రష్ ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ప్రత్యేక శైలితో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైనట్లు సుధీర్ తెలపడంతో హౌస్‌లో సందడి నెలకొంది.
-
06 Sep 2026 07:59 PM (IST)
మూడవ కంటెస్టెంట్
బిగ్ బాస్ అగ్నిపరీక్షలో టికెట్ టు బిగ్ బాస్ హౌస్ గెలిచిన సింగర్ ఝాన్సీ ఎంట్రీ ఇచ్చారు.
-
06 Sep 2026 07:59 PM (IST)
సామాన్యుల భాగస్వామ్యం
'అగ్నిపరీక్ష' సీజన్-2 ద్వారా 22 రోజుల సుదీర్ఘ పోరాటం తర్వాత ఎంపికైన టాప్-13 కామనర్స్ ను ప్రేక్షకులకు నాగార్జున పరిచయం చేశారు.
-
06 Sep 2026 07:59 PM (IST)
రెండవ కంటెస్టెంట్
ఇటీవలే 'చెన్నై లవ్ స్టోరీ' చిత్రంతో అలరించిన హీరో త్రిగుణ్ (ఆదిత్ అరుణ్) రెండవ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు.
-
06 Sep 2026 07:58 PM (IST)
మొదటి సెలబ్రిటీ కంటెస్టెంట్
'ఎన్నెన్నో జన్మల బంధం' సీరియల్ నటి దేబ్జానీ మోదక్ మొదటి సెలబ్రిటీ పోటీదారుగా హౌస్‌లో అడుగుపెట్టారు.
-
06 Sep 2026 07:57 PM (IST)
దక్షిణాది బిగ్ బాస్ కలయిక
బిగ్ బాస్ చరిత్రలోనే తొలిసారిగా నాలుగు దక్షిణాది భాషల షోలు ఒకేసారి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఇతర భాషల హోస్టులు మోహన్ లాల్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్‌లతో నాగార్జున వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి ప్రత్యేకతను చాటారు.
-
06 Sep 2026 07:57 PM (IST)
రోబోతో నాగ్ ఎంట్రీ
హోస్ట్ నాగార్జున తన కుమారుడు అఖిల్ నటించిన 'లెనిన్' చిత్రంలోని మాస్ పాటతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. హౌస్‌లోకి ఒక రోబోతో కలిసి ప్రవేశించిన నాగ్, ఈసారి ఆటలో కేవలం తెలివితేటలే కాకుండా మానవ సంబంధాలు, ఎమోషన్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయని వెల్లడించారు.
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!