Site icon NTV Telugu

Bigg Boss Fight: బిగ్ బాస్ లో పొట్టుపొట్టు కొట్టుకున్న కంటెస్టెంట్స్..

Untitled Design

Untitled Design

తమిళనాడులో జరుగుతున్న బిగ్ బాస్ 9 హౌస్‌ కాస్త వివాస్పదంగా మారింది. అందులో పార్టిసిపేట్ చేస్తున్న కంటెస్టెంట్స్ ఏం జరిగిందో తెలియదు కానీ పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. నిన్న ప్రసారం అయిన తమిళ బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ కొట్టుకోవడం సంచలనంగా మారింది. బిగ్ బాస్ తమిళ సీజన్ 9 హౌస్‌లో పోటీదారులు కమరుద్ధీన్, ప్రవీణ్ రాజ్ మధ్య వివాదం చెలరేగింది. వివాదం కాస్త ముదరడంతో కమరుద్దీన్ కోపంతో ప్రవీణ్ రాజ్ మీదికి దూసుకు వెళ్ళాడు. హౌసులో సభ్యులు ఎంత ఆపుతున్నా వారిద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.గొడవ మధ్యలో వెళ్లిన ఇతర కంటెస్టెంట్స్ ను పక్కకి నెట్టి మరీ కొట్టుకోవడం సెన్సేషనల్ అవుతోంది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్లో వైరల్ అవుతోంది. ఇది బిగ్ బాస్ హౌస్ అనుకుంటున్నారా? WWE అనుకుంటున్నారా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version