NTV Telugu Site icon

బిగ్‌బాస్‌ 5: కన్సిస్టెంట్స్ పై అసంతృప్తి.. హౌస్‌లో సందడి సాధ్యమేనా?

కరోనా కాలం మొదలైనప్పటి నుంచి బుల్లితెర వినోద కార్యక్రమాలకు విపరీతమైన ఆదరణ పెరిగింది. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా అన్ని రకాల కంటెంట్ లు అందుబాటులోకి వచ్చేశాయి. ఇప్పటికే ఎంటర్టైన్మెంట్ విషయంలో పోటాపోటీ కార్యక్రమాలు వస్తుండగా.. నిన్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ప్రారంభమైంది. అక్కినేని నాగార్జున హోస్ట్ గా భారీ ఎత్తున ప్రారంభించారు. మొదటి రోజే 19 మంది కన్సిస్టెంట్స్ బిగ్‌బాస్‌ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే, ఇందులో చాలా మంది ప్రేక్షకులకు తెలియకపోవడంతో కాస్త నిరాశచెందారు.

మొదటి కన్సిస్టెంట్స్ మొదలు.. చివరి కన్సిస్టెంట్స్ దాకా షాకుల మీద షాకులు ఇచ్చారు. నటి ప్రియా, యాంకర్ రవి, డ్యాన్స్ మాస్టర్ అనీ, సింగర్ శ్రీ రామ్ చంద్ర, లోబో, షణ్ముఖ్ జస్వంత్ వంటి పేర్లతో ప్రేక్షకులకు పెద్దగా ఇబ్బందిగా లేకున్నా.. మిగితా వారిలో సగం మందికి పైగా పరిచయం లేని వాళ్ళు కావడంతో అప్పుడే ట్రోల్స్ ప్రారంభించారు. ఈ కన్సిస్టెంట్స్ గూర్చి.. గూగుల్ తల్లిని అడిగినా..? ‘నాకు మాత్రం ఏంతెలుసు..!’ అనే సమాధానాలు ఇస్తున్నట్లుగా మీమ్స్ మొదలెట్టేశారు.

ఇక మొదట ఎగ్జిట్ అయ్యే వాళ్ళ నుంచి.. చివరకి మిగిలే కన్సిస్టెంట్స్ లను ఇప్పుడే డిసైడ్ చేస్తున్నారు. గత బిగ్‌బాస్‌ తెలుగు సీజన్స్ అన్ని ఫర్వాలేదనిపించిన ఈ సీజన్ మాత్రం ఆరంభ రోజే ఆకట్టుకోలేక పోయిందని అంటున్నారు. ఆ సీజన్స్ లో ఫేవరేట్ కన్సిస్టెంట్స్ లో కనీసం ముగ్గురు, నాలుగు అయినా లిస్ట్ లో వుండే వారు. ఈ సీజన్ లో బిగ్‌బాస్‌ ఆ ఛాయస్ కూడా ఇవ్వలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే బిగ్‌బాస్‌ సెట్ ను గత సీజన్స్ కంటే అందంగా డిజైన్ చేశారు. హౌస్ ను అంత బాగా రెడీ చేసి.. కన్సిస్టెంట్స్ ఎంపికను మరిచారంటూ సెటైర్లు వేస్తున్నారు. మరోవైపు ఐపీఎల్ కూడా ప్రారంభం కానున్న తరుణంలో బిగ్‌బాస్‌ 5 సీజన్ ఈమేరకు మెప్పిస్తుందో చూడాలి!