NTV Telugu Site icon

Bigg Boss 7 Telugu: కొత్త అవతారంలో తేజ.. కెప్టెన్సీ కోసం బిగ్ బాస్ టాస్క్ అదిరిపోయిందిగా..

Bb9th

Bb9th

తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బస్ సీజన్ 7 మంచి రసవత్తరంగా సాగుతోంది. నామినేషన్స్ పూర్తి కావడంతో ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్ కోసం కొత్త కొత్త టాస్క్ లను ఇస్తున్నాడు బిగ్ బాస్.. గత వారం కన్నా ఈ వారం టాస్క్ లు చాలా కొత్తగా ఉన్నాయి.. ఇక ఈ వారం ఎనిమిది నామినేషన్స్ లో ఉన్నారు.. అమర్ దీప్, రతిక, శోభాశెట్టి, ప్రియాంక, అర్జున్, తేజా, భోలే, యావర్ నామినేషన్స్ లో ఉన్నారు. ఈ నామినేషన్స్ ప్రక్రియ వాడివేడిగా జరిగింది.నేటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు.

ఇక ఈవారం కెప్టెన్సీ కంటెండర్ కోసం టాస్క్ లు ఇచ్చాడు బిగ్ బాస్.. ఈ ప్రోమోలో మొదట తేజను శోభా అమ్మాయిలాగా తయారు చేశారు.. అమ్మాయిలా మారిపోయాను కాబట్టి అమ్మాయిలను హగ్ చేసుకోవచ్చు అంటూ శోభ, రతికాలను హగ్ చేసుకున్నాడు. ఆతర్వాత శివాజిమనిద్దరి జోడీ బాగుంది కదా.. అని అంటే ఏం జోడీ బిబి జోడీనా.. అంటే లేదు అన్నా చెల్లెలు అని శివన్న అంటారు.. అ తర్వాత బిగ్ బాస్ హాల్ ఆఫ్ బాల్ అనే టాస్క్ ఇచ్చాడు. ఎవరి బలం ఎంతో చూడాలి అంటూ బిగ్ బాస్ చెప్పాడు..ఒక పైప్ నుంచి వచ్చే చిన్న చిన్న బాల్స్ ను తమ దగ్గరున్న కవర్స్ లో పట్టుకోవాలి. అయితే ఈ ప్రాసెస్ లో ఒకరి బ్యాగ్స్ ఒకరు లాక్కున్నారు.

పైప్ పైన ఉంటడంతో పొడుగ్గా ఉన్న అర్జున్ బ్యాగ్ లో ఎక్కువ బాల్స్ పట్టుకున్నాడు. అయితే ఆ బ్యాగ్ ను గౌతమ్ లాగేసుకున్నాడు. ఆతర్వాత కిందపడ్డ బాల్స్ ను కూడా అందరు ఏరుకున్నారు. అయితే బ్యాగ్స్ లాక్కోవద్దు అను భోలే , రతికా అనడంతో నేను లాక్కుంటా నాదగ్గర బ్యాగ్ ను అర్జున్ లాక్కున్నాడు. నేను రతికా దగ్గర బ్యాగ్ ను లాక్కుంటా అని గట్టిగానే చెప్పాడు అర్జున్..రతికా తన బాల్స్ ను దాచిపెట్టేసింది. అయితే శివాజీ ఈ హౌస్ వాళ్లకు నేర్పించిందే మనం .. మనమీదనే ప్లే చేస్తున్నారు అని అన్నాడు. లాస్ట్ లో అమర్ ఎదో పెట్టినట్లు చూపించారు.. మరి ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి..