NTV Telugu Site icon

Bigg Boss 7 Telugu: బిగ్‏బాస్ హౌస్‏లో ‘స్కంద’ టీమ్ సందడి..

Big Boss Ram

Big Boss Ram

బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు మూడోవారం ఈరోజుతో పూర్తి కావొస్తుంది.. సోమవారం నుంచి శనివారం వరకు ఎలా ఉన్నా కూడా వీకెండ్ వచ్చింది అంటే ఆ సందడి వేరేలా ఉంటుంది.. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఇంట్లో సేఫ్ గేమ్ ఆడిన కంటెస్టెంట్లకు గట్టిగానే క్లాస్ తీసుకున్నారు నాగ్. ఇప్పటివరకు హౌస్ నుంచి ఇద్దరు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.. ఈరోజు హౌస్ నుంచి మరొకరు బయటకు వెళ్తున్నారు.. మొత్తం ఏడుగురు నామినేట్ కాగా.. ప్రిన్స్ యావర్ సేఫ్ అయినట్లు శనివారం నాగ్ ప్రకటించారు. ఇక ఇప్పుడు ఆరుగురిలో ఒకరు బయటకు రాబోతున్నారు. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో స్కంద మూవీ టీమ్ సందడి చేసింది..

హీరో రామ్ నటించిన స్కంద మూవీ ప్రమోషన్ లో భాగంగా రామ్ బిగ్ బాస్ హౌస్ కు వచ్చినట్లు తెలుస్తుంది.. అలా రామ్ వచ్చి రాగానే రామ్ కు ఓ పంచ్ ఇచ్చారు నాగ్. ఇప్పటివరకు నాతో మాట్లాడుతున్నప్పుడు కళ్లద్ధాలు పెట్టుకున్నావ్.. ఆడపిల్లలు కనిపించగానే తీసేశావ్ కదయ్యా అంటూ డైలాగ్ వేశారు. ఇక ఆ తర్వాత శివాజీ మాట్లాడుతూ త్వరగా పెళ్లి చేసుకో రామ్.. చాలా చేయాల్సి ఉంటుంది కదా.. లేట్ అయిపోతుందంటూ అన్నారు. ఈ మాట ఇష్టంతో చెబుతున్నారా లేక బాధగా అంటున్నారా అని రామ్ అడగ్గా.. ఊబిలో ఉన్నోళ్లకు అందరినీ అందులోకి లాగాలని ఉంటుందంటూ కౌంటరిచ్చాడు నాగ్.. కాసేపు హౌస్ లో నవ్వులు పూసాయి..

రామ్ ఎంట్రీ కన్నా ముందు హౌస్ మెంబర్స్ తో చిన్న గేమ్ ఆడారు. ఇందులో భాగంగా ఒక్కొక్కరిని ఒక్కో ప్రశ్న అడిగారు. అయితే ముందుగా శివాజీని హౌస్ లో కలుపు మొక్క ఎవరు అని అడగ్గా.. చాలా మంది ఉన్నారంటూ చివరకు తేజ పేరు చెప్పాడు. ఆ తర్వాత తేనె పూసిన కత్తి ఎవరు అని దామిని అడగ్గా.. నేనే అంటూ చెప్పుకొచ్చింది దామిని.. అలాగే హౌస్ లో కలుపు తేజ అని అందరు అంటారు.. ఇక రతిక పై కూడా పంచులు వేస్తారు.. ఇలా నాగ్ అందరిపై పంచుల వర్షం కురిపించారు.. ఒకసారి ఆ ప్రోమోను చూసేయ్యండి..