బిగ్ బాస్ సీజన్ 7 లో 55వ ఎపిసోడ్ హీటెక్కించే విధంగా సాగింది. కొత్త కెప్టెన్ ని నిర్ణయించేందుకు బిగ్ బాస్ ఈ మిర్చి చాలా హాట్ అనే టాస్క్ ఇచ్చారు.. ఈ టాస్క్ లో శోభా ఎంతగా యావర్ ను రెచ్చగొట్టిందో నిన్నటి ఎపిసోడ్ లో చూసాము..హౌస్ లోకి సెకండ్ ఛాన్స్ తో రీ ఎంట్రీ ఇచ్చిన రతిక ఆమె పాత స్నేహితుడు పల్లవి ప్రశాంత్ మధ్య ఎమోషనల్ సంభాషణ సాగింది. సీజన్ మొదట్లో లవ్ బర్డ్స్ తరహాలో తిరిగిన రతిక, ప్రశాంత్ లు ఇప్పుడు గ్యాప్ మైంటైన్ చేస్తున్నారు. ప్రశాంత్ కూడా ఆమెని అక్కాఅని పిలుస్తున్నాడు. దీనితో ఇద్దరి మధ్య వివాదాలు సెటిల్ చేసుకునేందుకు రతిక ప్రయత్నించింది…
ఇక ప్రశాంత్ కూడా అన్ని గుర్తుచేసుకొని మళ్లీ ఏమోషనల్ అయ్యాడు.. ఇక మిర్చి టాస్క్ లో అందరి మెడలో మిర్చి మాలలు పడ్డాయి. కానీ గౌతమ్ కి మాత్రం ఎవరూ మిర్చి మాల వేయలేదు. దీనితో గౌతమ్ బిగ్ బాస్ కొత్త కెప్టెన్ గా అవతరించాడు. ఇంటి సభ్యులంతా అతడికి కంగ్రాట్స్ చెప్పారు.. అయితే బిగ్ బాస్ ఎనిమిదో వారం కూడా ముగింపుకు వచ్చింది.. గత ఏడు వారాల నుంచి బిగ్ బాస్ హౌస్ నుంచి అమ్మాయిలు ఎలిమినేట్ అయ్యారు.. ఇక ఇప్పుడు కూడా అమ్మాయినే ఎలిమినేట్ అవుతుందని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..
రెండు వారాల క్రితం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అమ్మాయి అశ్విని ఈ వారం హౌస్ నుంచి బయటకు వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.. సరిగ్గా టాస్క్ లు చెయ్యకపోవడం, జనాలను సరిగ్గా ఎంటర్టైన్మెంట్ చెయ్యలేదని జనాలు తక్కువ ఓటింగ్ వేశారని తెలుస్తుంది.. దాంతో ఈ అమ్మడు బయటకు వస్తుందని టాక్..ఇక ఈ చిన్నది ఈ వారం డేంజర్ జోన్ లో ఉంది. గతకొద్ది రోజులుగా అశ్విని ఆట అంతగా ఆకట్టుకోవడం లేదు. దాంతో ఆమెకు ఓట్లు కూడా అంతగా రావడం లేదు. ఈ వారం కూడా నామినేషన్స్ లో ఉన్న అశ్విని ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే మరికొద్ది గంటలు వెయిట్ చెయ్యాల్సిందే..