బిగ్ బాస్ 7 తెలుగు ఇప్పుడిప్పుడే ఇంట్రెస్టింగ్ గా మారుతుంది.. నాలుగో పవన్ అస్త్ర కోసం కంటెస్టెంట్స్ తెగ కష్టపడుతున్నారు.. ఇక బిగ్ బాస్ కూడా వింత టాస్క్ లను ఇస్తూ జనాలను ఎంటర్టైన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు..గత సీజన్స్ తో పోలిస్తే ఈసారి సీజన్ 7 ను చాలా విభిన్నంగా ప్లాన్ చేశారు. ఇందుకు తగ్గట్టుగానే బిగ్ బాస్ 7 లో ముందుగా 14 మందిని హౌస్ లోకి పంపించారు. అంతకు ముందు దాదాపు 20 మందిని హౌస్ లోకి పంపించే వారు. ఈ సారి 14 మందినే పంపించారు. అందులో ఎవరు హౌస్ మేట్స్ గా కన్ఫర్మ్ కాదు అని ఆడి గెలిచినా వల్లే హౌస్ మేట్స్ గా ఎంపిక అవుతారని తెలిపాడు. ఇక ఇప్పుడు హౌస్ లో నుంచి ఒకొక్కరుగా ఎలిమినేట్ అవుతూ బయటకు వచ్చేస్తున్నారు.
ఇప్పటివరకు ముగ్గురిని బిగ్ బాస్ ఎలిమినేట్ చేసి బయటకు పంపించింది.. ఇక నాలుగో వారం నామినేషన్స్ కూడా పూర్తి అయ్యాయి.. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ హౌస్ లోకి కొత్త వాళ్లను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు బిగ్ బాస్ యాజమాన్యం..అక్టోబర్ 9న బిగ్ బాస్ మరోసారి లాంచ్ ఈవెంట్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఈవెంట్ తో మరో ఆరుగురు లేదా ఏడుగురు కంటెస్టెంట్స్ ను బిగ్ బాస్ హౌస్ లోకి పంపనున్నారని తెలుస్తోంది.. కాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా ఈసారి ఆరుగురుని హౌస్ లోకి పంపనున్నారు. అయితే హౌస్ లోకి ఎవరు వెళ్తున్నారన్నది ఇంతవరకు క్లారిటీ లేదు. కానీ సోషల్ మీడియాలో కొంతమంది వస్తున్నారని తెగ ప్రచారం చేస్తున్నారు..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లిస్ట్ ప్రకారం.. నటి అంజలి వపన్, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ భోలే షావలి, హీరోయిన్ ఫర్జానా, సురేఖావాణి కూతురు సుప్రిత, జబర్దస్త్ ఫేమ్ నరేష్, నటి పూజా మూర్తి కూడా వైల్డ్ కార్డ్‌తో బిగ్ బాస్ హౌస్ లోకి రానున్నారని సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి.. మరి ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చూడాల్సిందే..