NTV Telugu Site icon

Bigg Boss 7 Telugu: బిగ్‏బాస్ స్టేజ్ పై హీరో శ్రీకాంత్ సందడి.. అమర్ ను సపోర్ట్ చేస్తూ..

Bb Srikanth

Bb Srikanth

బిగ్ బాస్ లో వారాంతరం వస్తే ఫన్ డబుల్ ఉంటుంది.. నాగార్జున రావడం ఒక ఎత్తయితే.. ఆదివారం అయితే సెలెబ్రేటీలు వస్తారు.. వాళ్లు చేసే సందడి మాములుగా ఉండదు.. నాగార్జున ప్రతి సండే ఇంటి సభ్యులతో సరదాగా కొన్ని గేమ్స్ ఆడిస్తారు.. అలాగే చివరకు ఎలిమినేషన్ టెన్షన్ పెట్టేస్తారు. ఇప్పటివరకు పది వారాలు ఎలినిమినేషన్స్ జరగ్గా.. లేటేస్ట్ సమాచారం ప్రకారం 11వ ఎలిమినేషన్ లేదని తెలుస్తోంది. ఈవారం అశ్విని, రతిక, శోభాశెట్టి డేంజర్ జోన్లో ఉండగా.. అందరికంటే తక్కువ ఓట్లు వచ్చింది శోభా.. ఆమెను సేవ్ చెయ్యాలనే ఎలిమినేషన్ తీసేసారని వార్తలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

ఇకపోతే తాజాగా ఈరోజు ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది.. బిగ్‏బాస్ స్టేజ్ పై ‘కోట బొమ్మాళి పీఎస్’ మూవీ టీమ్ సందడి చేసింది. తమ ప్రమోషన్ కోసం సీనియర్ హీరో శ్రీకాంత్, శివానీ రాజశేఖర్, వరలక్ష్మి శరత్ కుమార్ వచ్చారు. ముఖ్యంగా శ్రీకాంత్ తన స్నేహితుడు శివాజీనీ ఓ ఆటాడుకున్నాడు. అలాగే హౌస్మేట్స్ ఒక్కొక్కరి గురించి ఇంట్రెస్టింగ్ రివ్యూస్ ఇచ్చాడు… లింగ్ లింగ్ లింగిడీ పాటకు హీరోయిన్, హీరో ఇద్దరు స్టేజ్ పై డ్యాన్స్ చేశారు..

ఆ తర్వాత శ్రీకాంత్ మాట్లాడుతూ.. శివాజీకి అయితే బెస్ట్ ఫ్రెండ్ అంటూ కోట బొమ్మళి టీంను పరిచయం చేశాడు. ఆ తర్వాత శ్రీకాంత్ మాట్లాడుతూ.. వెనక కూర్చున్న శివాజీని పక్కకి రా అంటూ ఆప్యాయంగా పలకరించాడు. ఎలా ఉన్నావ్ రా బాబు ఇన్ని రోజులు అంటూ కామెడీ చేశాడు. గేమ్ మాత్రం సూపర్ ఆడుతున్నావ్ అంటూ పొగడ్తలు కురిపించాడు.. ఇక అమర్ తో..నీ జీవితంలో లక్ లేదని అనుకుంటున్నావ్.. కానీ ప్రయత్నించి చూడు లక్ ఆటోమేటిక్ గా వస్తుంది అంటూ మోటివేట్ చేశాడు.. ఒక్కొక్కరి గురించి ప్రత్యేకంగా చెప్పాడు శ్రీకాంత్.. మొత్తానికి ప్రోమో సరదాగా సాగింది.. ఎపిసోడ్ ఎంత ఫన్ గా ఉంటుందో చూడాలి..