Site icon NTV Telugu

Bigg Boss 7 Telugu: బంఫర్ ఆఫర్ కొట్టేసిన గౌతమ్.. మూడు సినిమాల్లో హీరోగా ఛాన్స్..

Gautham Krishna

Gautham Krishna

తెలుగు టాప్ రియాలిటి బిగ్ బాస్ 7 షో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ నిన్న గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే.. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సీజన్ గ్రాండ్ గా జరిగింది. శుభ శ్రీ.. గౌతమ్, పూజా మూర్తి.. అశ్విని, టేస్టీ తేజ.. శోభా, సందీప్.. నయని, భోలే స్టెప్పులతో అదరగొట్టేశారు. బిగ్‏బాస్ సీజన్ 7 పై సొంతంగా కంపోజ్ చేసిన పాటకు భోలే స్టెప్పులతో అదరగొట్టేశారు. ఆ తర్వాత హౌస్ లో ఉన్న ఆరుగురు ఫైనలిస్ట్స్ ఒక్కొక్కరిగా పర్ఫామెన్స్ ఇచ్చారు.. ఆ షోకు హైలెట్ ఇదే..

అందరు సినిమాల్లో అవకాశాలను అందుకున్నారు.. అందరు చాలా సంతోషంగా ఉన్నట్లు చెబుతున్నారు.. ఇక డాక్టర్ బాబు గౌతమ్ చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. చాలా బాగున్నాను.. మూడు సినిమాలకు హీరోగా సైన్ చేశాను అని అన్నాడు. మా అమ్మగారికి రిటైర్మెంట్ ముందే ఇప్పిస్తున్నాను.. అంతకు ముందు రిటైర్మెంట్ అంటే ఇంకా సెటిల్ కాలేదని భయం ఉండే.. కానీ ఇప్పుడు అలా లేదంటూ సంతోషంగా మాట్లాడాడు.. సినిమాల్లో రానించాలనే కోరిక బిగ్ బాస్ తో తీరిందని సంతోషాన్ని వ్యక్తం చేశాడు..

ఇక కంటెస్టంట్స్ అందరు కూడా బాగానే రెమ్యూనరేషన్ తీసుకున్నారు.. అందులో అందరికన్నా ఎక్కువగా శివాజీ తీసుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.. వారానికి ఏకంగా 4.5 లక్షలను తీసుకున్నట్లు తెలుస్తుంది.. రన్నర్ గా నిలిచిన అమర్ కూడా రూ. 37 లక్షలు సంపాదించినట్లు తెలుస్తుంది.. విన్నర్ గా ప్రశాంత్ కూడా రూ.50 లక్షల వరకు సంపాదించారు.. అలాగే కారును కూడా సొంతం చేసుకున్నారు.. మొత్తానికి ఈ సీజన్ లో పాల్గొన్న అందరు బాగా అందుకున్నారు.. త్వరలోనే ఓటీటీలో కూడా ఈ షో రిలీజ్ అవ్వనుందని తెలుస్తుంది..

Exit mobile version